సంక్రాంతి సెలవులు ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం

-

తెలంగాణ ప్రభుత్వం సంక్రాంతి పండుగకు సంబంధించి అధికారికంగా పాఠశాలలకు సెలవులను ప్రకటించింది. సంక్రాంతి పండుగ నేపథ్యంలో జనవరి 12వ తేదీ నుంచి 17వ తేదీ వరకు సెలవులు ఉంటాయని ఓ ప్రకటనలో తెలిపింది. ఈ క్రమంలో మిషనరీ స్కూల్ లకు మినహా అన్ని స్కూళ్లకు ఈ సెలవులు వర్తిస్తాయని వెల్లడించింది. సంక్రాంతి సెలవులు జనవరి 12వ తేదీ ప్రారంభం కానున్నాయి. మరుసటి రోజు రెండో శనివారము ఆ తర్వాత 14 ఆదివారం భోగి పండుగ, 15వ తేదీ సోమవారం సంక్రాంతి పర్వదినం. 16వ తేదీ కనుమ పండుగ. 17వ తేదీన ప్రభుత్వం పాఠశాలలకు అదనంగా సెలవు ఇచ్చింది. దీంతో ఆరు రోజులపాటు స్కూల్ లకు సెలవులు వస్తున్నాయి. ప్రైవేటు విద్యాసంస్థలు సిలబస్ పేరిట పండుగ హాలిడేస్లలో క్లాసులు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని విద్యాశాఖ వెల్లడించింది.

Telangana Govt
Telangana Govt

మరోవైపు జనవరి 26న రిపబ్లిక్ డే సెలవు ఉంది. ఆదివారములు, జనవరి 01 తో కలుపుకుంటే మొత్తం జనవరి నెలలో 12 రోజులు సెలవులు వచ్చాయి. కేవలం 19 రోజులు మాత్రమే జనవరి నెలలో పాఠశాలలు కావడం గమనార్హం. పాఠశాలతో పాటు ఇంటర్మీడియట్ విద్యార్థులకు మాత్రం జనవరి 13వ తేదీ నుంచి 16వ తేదీ వరకు సెలవులు. అంటే ఇంటర్ విద్యార్థులకు కేవలం నాలుగు రోజులు మాత్రమే సెలవులను మంజూరు చేసింది విద్యాశాఖ. ఇంటర్ విద్యార్థులు 17వ తేదీ తిరిగి యధావిధిగా కళాశాలకు హాజరు కావాలని ఇంటర్మీడియట్ బోర్డు పేర్కొంది.

Read more RELATED
Recommended to you

Latest news