ప్రపంచంలోనే వరస్ట్ కర్రీగా చోటు సంపాదించుకున్న ఈ ఇండియన్‌ కర్రీ

-

ఎవరినైనా మీకు ఏ కూరగాయలు నచ్చవు? అని అడిగితే ఎక్కువమంది చెప్పేవి వంకాయ, కాకరకాయ ముందు చెప్తారు. ఈ రెండు కూరగాయలను ఇష్టపడే వారి సంఖ్య చాలా తక్కువ. ముఖ్యంగా వంకాయల్లో తెల్ల వంకాయలు తినేవారు ఎక్కువమంది ఉన్నారు, కానీ ఊదా రంగులో ఉండే వంకాయకు అభిమానులు చాలా తక్కువ. దీనితో ఎన్నో రకాలు వంటకాలు చేయవచ్చు. ఊదా రంగు వంకాయతో ఉండే ‘ఆలూ భైంగన్’ కర్రీ ప్రపంచంలోనే చెత్త ఆహారాలలో చోటు సంపాదించింది. అది ఎలా అంటారా..?

ఆన్‌లైన్ ఫుడ్ పోర్టల్ ‘టేస్ట్ అట్లాస్’ ప్రతి ఏడాది ప్రపంచంలోని టాప్ 100 చెత్త ఆహారాల జాబితాను విడుదల చేస్తుంది. అలాగే ఈసారి కూడా చేసింది. మన దేశం నుంచి తక్కువ రేటింగ్స్ పొందిన ఆలూ భైంగన్ ఆ జాబితాలో చోటు సంపాదించింది. ఇది 100 వంటకాల్లో 60వ స్థానాన్ని దక్కించుకుంది. ఈ కూరను బంగాళదుంప, వంకాయ, ఉల్లిపాయలు, టమాటాలు, అల్లం వెల్లుల్లి పేస్టు వేసి చేస్తారు. ఇది ఒక గ్రేవీ వంటకం. దీన్ని ఇష్టపడేవారు మన దేశంలో చాలా తక్కువగా ఉన్నారు. అందుకే దీనికి చాలా తక్కువ రేటింగ్ వచ్చింది. దీన్ని ఎక్కువగా ఉత్తర భారత దేశంలోనే తింటారట.

అన్నింటికన్నా ప్రపంచంలో అత్యంత తక్కువ రేటింగ్ పొందిన ఆహారంగా ‘హాకర్ల్’ నిలిచింది. ఇది ఐస్లాండ్‌కు చెందిన వంటకం. షార్క్ మాంసంతో మూడు నెలల పాటు దీన్ని పులియబెట్టి చేస్తారు. ఈ వంటకం చాలా ఘాటైన రుచిని కలిగి ఉంటుంది. ఇది మొదటిసారి తింటే ఎవరికీ నచ్చదు. దీన్ని తినేవారి సంఖ్య కూడా చాలా తక్కువ. ఐస్లాండ్‌లో ఉండే ప్రజలు దీన్ని ఇష్టంగా తింటారు. కానీ అక్కడికి వచ్చిన పర్యాటకులు మాత్రం ఈ ఆహారాన్ని తినలేరు. అందుకే ఇది అత్యంత చెత్త వంటకంగా అగ్రస్థానంలో నిలిచింది. ఇక రెండో స్థానంలో అమెరికాకు చెందిన రామన్ బర్గర్ నిలిచింది. రామన్ నూడిల్స్‌తో చేసే బర్గర్ ఇది. మధ్యలో మాంసాన్ని నింపి దీన్ని తయారు చేస్తారు. ఇది చాలా తక్కువ మందికి మాత్రమే నచ్చుతుంది.

టేస్టీ అట్లాస్ పోర్టల్‌లో ఎవరికి ఏ ఆహారం నచ్చదో తెలియజేయాలని కోరుతారు. ప్రతి దేశానికి చెందిన ప్రజలు ఈ సర్వేలో పాల్గొనవచ్చు. ఏ వంటకం బాగోదని ఎక్కువ మంది సూచిస్తారో వాటిని టాప్ 100 చెత్త వంటకాలలో ఎంపిక చేస్తారు. అలా మన దేశం నుంచి ఆలూ భైంగన్ ఈసారి చోటు సంపాదించింది.

Read more RELATED
Recommended to you

Latest news