అక్టోబర్ 21 నుంచి గ్రూప్-1 మెయిన్స్

-

తెలంగాణలో గ్రూప్-1 అభ్యర్థులకు అలర్ట్. అక్టోబర్ 21వ తేదీ నుంచి 27వ తేదీ వరకు గ్రూప్ 1 మెయిన్స్ పరీక్ష నిర్వహించనున్నట్లు తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ వెల్లడించింది. పరీక్షకు వారం రోజుల ముందు నుంచి అభ్యర్థులు హాల్ టికెట్ లు డౌన్లోడ్ చేసుకోవచ్చని స్పష్టం చేసింది.

గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఫలితాలు విడుదల చేసిన టీజీపీఎస్సీ.. ఫైనల్ కీ విడుదల చేసిన వెంటనే ఫలితాలను ప్రకటించింది. 31 వేల 382 మంది మెయిన్స్‌కి ఎంపికైనట్టు ప్రకటించింది. జూన్ 9వ తేదీ న గ్రూప్1 -ప్రిలిమ్స్ నిర్వహించిన కమిషన్ …. జూన్ 13వ తేదీన ప్రిలిమినరీ కీతో పాటు ప్రధాన ప్రశ్న పత్రాన్ని అభ్యర్థుల లాగిన్ లో అందుబాటులో ఉంచింది. ప్రాథమిక కీ పై అభ్యంతరాలు స్వీకరించిన తరువాత నిపుణుల అభిప్రాయాలు తీసుకుని తుది కీ తో పాటు ఫలితాలను ఇవాళ విడుదల చేసింది. ఎంపికైన అభ్యర్థుల వివరాలు వెబ్ సైట్ లో చూసుకోవచని కమిషన్ పేర్కొంది.

Read more RELATED
Recommended to you

Latest news