గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్ష వాయిదాకు హైకోర్టు ధర్మాసనం నిరాకరణ

-

ఈనెల 11న గ్రూప్-1 ప్రిలిమ్స్ యథాతథంగా జరగనుంది. పరీక్ష వాయిదా వేసేందుకు నిరాకరించిన హైకోర్టు పిటిషన్లను కొట్టివేసింది. ప్రశ్నపత్రాల లీకేజీతో గత అక్టోబరులో నిర్వహించిన.. గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ రద్దైన విషయం తెలిసిందే. అయితే టీఎస్‌పీఎస్సీ పాలకమండలి, సిబ్బందిలో మార్పులు చేయకుండా.. మళ్లీ వారితోనే పరీక్ష నిర్వహించడం సరికాదంటూ పలువురు అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించారు. దర్యాప్తు పూర్తయ్యే వరకు గ్రూప్‌-1 ప్రిలిమ్స్ వాయిదావేయాలని.. యూపీఎస్సీ వంటి సంస్థకు అప్పగించాలన్న పిటిషన్లపై హైకోర్టు ధర్మాసనం మరోసారి విచారణ చేపట్టింది.

ఈ సందర్భంగా.. గ్రూప్- 1 ప్రిలిమ్స్ పరీక్ష వాయిదాపై తెలంగాణ హైకోర్టు మరోసారి కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ పరీక్ష వాయిదాకు హైకోర్టు నిరాకరించింది. ఎల్లుండి జరగనున్న ప్రిలిమ్స్ పరీక్షలో జోక్యానికి ధర్మాసనం నిరాకరిస్తూ.. అప్పీల్‌ను కొట్టివేసింది. గ్రూప్- 1 ప్రిలిమ్స్ వాయిదా వేయాలన్న పిటిషన్లను ఇటీవల సింగిల్‌ జడ్జి కొట్టేయగా.. ఆ ఉత్తర్వులను ధర్మాసనం వద్ద ఓ విద్యార్థి సవాల్‌ చేశారు. ఈ నేపథ్యంలో విచారణ చేపట్టిన జస్టిస్ అభినంద్ కుమార్ షావిలి, జస్టిస్ నామవరపు రాజేశ్వర రావుతో కూడిన హైకోర్టు ధర్మాసనం.. గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్షను నిలిపివేయడం పరిష్కారం కాదని అభిప్రాయపడింది.

Read more RELATED
Recommended to you

Latest news