బండి సంజయ్ పిటిషన్‌పై విచారణ ఈనెల 10కి వాయిదా

-

పదో తరగతి క్వశ్చన్ పేపర్ లీకేజీలో ఆరోపణలు ఎదుర్కొంటున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్​ను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్​కు పంపిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో తన రిమాండ్​ను రద్దు చేయాలంటూ సంజయ్ హైకోర్టును ఆశ్రయించారు. సంజయ్ లంచ్ మోషన్ పిటిషన్​పై విచారణ చేపట్టిన ఉన్నత న్యాయస్థానం ఆయనకు షాక్ ఇచ్చింది. ఈ వ్యాజ్యంపై విచారణను ఈనెల 10వ తేదీకి వాయిదా వేసింది.

 

సంజయ్ పిటిషన్​పై కౌంటర్ దాఖలు చేయాలని పోలీసులను హైకోర్టు ఆదేశించింది. బెయిల్ పిటిషన్ వేసుకోవచ్చని బండి సంజయ్​కు తెలిపింది. రిమాండ్ రద్దు చేయాలని.. 41ఏ నోటీసు ఇవ్వకుండా అరెస్టు చేశారని సంజయ్ పిటిషన్​లో వెల్లడించారు.

మరోవైపు.. హెబియస్ కార్పస్ పిటిషన్‌పై కూడా విచారణ జరపాలని సంజయ్‌ తరఫున న్యాయవాదులు కోర్టును కోరారు. నిన్న హౌజ్ మోషన్ హెబియస్ కార్పస్ పిటిషన్ వేయగా…. విచారణకు హైకోర్టు నిరాకరించింది. ఇవాళ మధ్యాహ్నం రెండున్నర గంటలకు జస్టిస్ అభినంద్ కుమార్ షావిలి, జస్టిస్ పుల్లా కార్తీక్ ధర్మాసనం విచారణ జరపనుంది.

Read more RELATED
Recommended to you

Latest news