ముంపు ప్రాంతాల్లో ఏం చర్యలు తీసుకున్నారో చెప్పండి.. ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం

-

రాష్ట్రంలో గత వారం కురిసిన వర్షాలతో ప్రజల జీవనం అస్తవ్యస్తమైపోయింది. భారీ వర్షాలు.. వరదలు రాష్ట్ర ప్రజలను బెంబేలెత్తించాయి. అయితే వర్షాలు-వరదలపై ప్రభుత్వం తీసుకున్న సహాయక చర్యలపై డాక్టర్ చెరుకు సుధాకర్ హైకోర్టులో పిటిషన్ వేశారు. ఈ పిటిషన్​పై విచారణ చేపట్టిన ధర్మాసనం.. వరద బాధితుల సహాయార్థం ముంపు ప్రాంతాల్లో ఎలాంటి చర్యలు తీసుకున్నారో నివేదిక ఇవ్వాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. వరదల్లో ఎంత మంది మరణించారు? బాధిత కుటుంబాలకు పరిహారం చెల్లించారా? అనే దానిపై నివేదిక ఇవ్వాలని కోరింది.

మరోవైపు ముంపు ప్రాంతాల్లో చిక్కుకున్న ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారా.. లేదా? అనే విషయాలను కూడా వివరించాలని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. పునరావాస కేంద్రాల్లో ఎలాంటి సదుపాయాలు కల్పించారో చెప్పాలని డిమాండ్ చేసింది. డ్యామ్ పరిరక్షణ చట్టానికి అనుగుణంగా చర్యలు తీసుకున్నారా..? అనే విషయాలపై సమగ్ర వివరాలతో ఈ నెల 31వ తేదీకి నివేదిక ఇవ్వాలని హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది.

Read more RELATED
Recommended to you

Latest news