నామినేషన్ వేసే ముందు అయోధ్యకు రాహుల్‌, ప్రియాంక గాంధీ?

-

ఉత్తరప్రదేశ్‌లోని అమేఠీ, రాయ్‌బరేలీలో కాంగ్రెస్‌ అభ్యర్థులపై ఇంకా క్లారిటీ రాలేదు. గాంధీ కుటుంబసభ్యులే ఈ స్థానాల నుంచి పోటీ చేస్తారని జోరుగా ప్రచారం జరుగుతోంది. ఈ వార్తల నడుమ కాంగ్రెస్ పార్టీ విశ్వసనీయ వర్గాలను ఉటంకిస్తూ జాతీయ మీడియా కథనాలు ఓ విషయాన్ని వెల్లడించాయి. అదేంటంటే..? త్వరలోనే ఆ పార్టీ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీ అయోధ్య రాముడి సందర్శనకు వెళ్లనున్నారట.

వయనాడ్‌ నుంచి రాహుల్‌ వరుసగా రెండోసారి పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇక రేపటి నుంచి అమేఠీ, రాయ్‌బరేలీ స్థానాల్లో నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమవుతుంది. అమేఠీ నుంచి రాహుల్‌, రాయ్‌బరేలీ నుంచి ప్రియాంక గాంధీ పోటీ చేసే అవకాశాలు బలంగా కన్పిస్తున్నాయి. ఈ రెండు స్థానాలకు నామినేషన్‌ వేసేందుకు మే 3 ఆఖరు తేదీ. అయితే దానికి రెండు రోజుల ముందే రాహుల్‌, ప్రియాంక వేర్వేరు రోజుల్లో నామినేషన్‌ వేసే అవకాశాలున్నాయని సమాచారం. ఈ స్థానాల్లో వీరు ప్రచారం మొదలుపెట్టడానికి ముందు అయోధ్యలో బాలరాముడిని దర్శించుకోనున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news