నేటి నుంచి ఇంటర్‌ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలు

-

తెలంగాణ ఇంటర్‌ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలు ఇవాళ్టి (మే 24వ తేదీ) నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ క్రమంలో ఇంటర్‌ బోర్డు గుడ్‌న్యూస్‌ చెప్పింది. విద్యార్థులు పరీక్షకు 5 నిమిషాలు ఆలస్యంగా వచ్చినా అనుమతిస్తామని తెలిపింది. వార్షిక పరీక్షల్లోనూ విద్యార్థులకు ఇదే వెసులుబాటు కల్పించిన విషయం తెలిసిందే. శుక్రవారం నుంచి ప్రారంభం కానున్న ఇంటర్‌ అడ్వాన్స్‌డ్‌ పరీక్షలు ఉదయం 9:00 గంటల నుంచి మొదలవుతాయి. విద్యార్థులు గంట ముందే పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని అధికారులు సూచించారు.

మరోవైపు రాష్ట్రంలో జూన్‌ 3వ తేదీ వరకు జరిగే ఈ పరీక్షలను ఉదయం 9 గంటల నుంచి మధ్యా హ్నం 12 గంటల వరకు ఫస్టియర్‌ విద్యార్థులకు.. మధ్యాహ్నం 2: 30 గంటల నుంచి సాయంత్రం 5 : 30 గంటల వరకు సెకండియర్‌ విద్యార్థులకు పరీక్షలు నిర్వహిస్తారు. మొత్తం 4.6 లక్షల మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 900 పరీక్షాకేంద్రాలను ఇంటర్‌బోర్డు ఏర్పాటు చేసింది. విద్యార్థులు https://tsbie.cgg.gov.in/ వెబ్‌సైట్‌ నుంచి హాల్‌టికెట్లను డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news