తెలంగాణ భవిష్యత్ ఎల్బీస్టేడియంలో ఉన్న టీచర్ల చేతిలోనే ఉందని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ఎల్బీ స్టేడియంలో ప్రమోషన్లు పొందిన టీచర్లతో సీఎం ముఖాముఖీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ పేదవాడికి ఉన్నత విద్య అందినప్పుడే రాష్ట్రం బాగుపడుతుంది. 30వేల పాఠశాలల్లో తెలంగాణ భవిష్యత్ దాగి ఉంది. ఉద్యమంలో టీచర్ల పాత్రను ఎవ్వరూ కాదనరు.
సాధించుకున్న రాష్ట్రంలో మేధావులకు అవమానం జరిగింది. విద్యకు రూ.21వేల కోట్లకు పైగా బడ్జెట్ లో ప్రవేశపెట్టామని తెలిపారు సీఎం రేవంత్ రెడ్డి. పదేళ్లు ఉపాధ్యాయుల సమస్యలను పట్టించుకోలేదు. విద్యకు 10 శాతం నిధులు ఇవ్వాలని తొలుత భావించాం. కానీ గత ప్రభుత్వం చేసిన అప్పుల వల్ల అది సాధ్యం కాలేదు. ఒకేసారి టీచర్లందరికీ ప్రమోషన్లు, బదిలీలీలు అద్భుతం అన్నారు. 1తేదీ రోజే టీచర్లకు జీతాలు చెల్లిస్తున్నాం. ప్రత్యేక రాష్ట్రంలో విద్యా విధానం బాగుపడుతుందని ఆశించాం. కానీ పదేళ్లలో ఉపాధ్యాయుల సమస్యను పట్టించుకున్నారా..? అని ప్రశ్నించారు. విద్యా వ్యవస్థను బాగు పరచాలన్నదే ప్రభుత్వ లక్ష్యం అన్నారు సీఎం రేవంత్ రెడ్డి.