కరోనా కొత్త వేరియంట్ ఆందోళనల నడుమ కేంద్రం అప్రమత్తం చేయడంతో రాష్ట్ర ఆరోగ్య మంత్రి దామోదర్ రాజనర్సింహ కీలక సూచనలు చేశారు. పండగ సీజన్ నేపథ్యంలో అవసరమైతే ప్రజలు మాస్కులు ధరించాలన్నారు.
శబరిమలకు వెళ్లే అయ్యప్ప భక్తులు అప్రమత్తంగా ఉండాలని కోరారు. మహమ్మారిని ఎదుర్కొనేందుకు రాష్ట్ర యంత్రాంగం పూర్తి సన్నద్ధతతో ఉందని చెప్పారు. ప్రజలు ఆందోళన చేయకుండా సరైన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
కాగా, ఇండియాలోని అన్ని రాష్ట్రాలకు కేంద్రం కొవిడ్ అలర్ట్ ప్రకటంచింది. కరోనా కేసులు పెరుగుతుండటంతో కేంద్రం అలర్ట్ అయింది. రాష్ట్రాలు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించిన కేంద్రం.. ఆర్టీపీసీఆర్ టెస్ట్ కిట్లను సిద్ధం చేయాలని ఆదేశించింది. కొవిడ్ టెస్టులకు సిద్ధంగా ఉండాలని అన్ని రాష్ట్రాలకు కేంద్రం ఆదేశాలు జారీ చేసింది.. JN.1 వేరియంట్ కేసులు పెరుగుతుండటంపై అలర్ట్ జారీ చేసింది కేంద్రం.