నెట్టింట్లో తెలంగాణ మంత్రి రాసలీలలు..యువతితో మత్తుగా..!

-

తెలంగాణలో కీలకమైన నియోజకవర్గం నుంచి గెలుపొంది..మంత్రి కూడా అయిన ప్రముఖ రాజకీయ నాయకుడు రాసలీల వివాదంలో చిక్కుకున్నారు..చట్టసభకు ప్రాతినిథ్యం వహిస్తున్న ఓ మంత్రిగారి రాసలీలలు ఆలస్యంగా వెలుగులోకి వచ్చాయి..కీలకమైన పదవుల్లో ఉన్నవారికి ప్రజలకు అందుబాటులో ఉండటానికి చాలా కష్టం..వారిని కలవడానికి కూడా తగినంత తీరిక దొరకదు..

కానీ ఈ మంత్రిగారు ఏకంగా అమ్మాయిలతో సోషల్ మీడియాలో ఛాటింగ్ చేయడానికి ఎక్కువ సమయం కేటాయించారు..తాజాగా ప్రముఖ మంత్రిగారు ఓ యువతితో చేసిన వాట్సాప్ ఛాటింగ్ ఆయన కుటుంబంలో విభేదాలకు దారితీసింది..దీంతో కీలకమైన బాధ్యతల్లో ఉన్న మంత్రిగారికి మనశ్శాంతి లేకుండా చేసింది సోషల్ మీడియాలో ఆ యువతితో చేసిన ఛాటింగ్..పార్టీ అధ్యక్షుడికి రాసలీల వ్యవహారం చేరిపోవడంతో మున్ముందు ఏం జరుగుతుందోననే ఆందోళన పట్టి పీడిస్తోంది మంత్రిగారికి.. ప్రస్తుత పరిస్థితి ఆయన భవిష్యత్తును ఎటువైపుకు తీసుకెళ్తుందో అనే అందోళనలో ఉన్నారు..


యువతితో ఈ మధ్య చేసిన వాట్సాప్ ఛాటింగ్ వ్యవహారం ఇప్పుడు తన సొంత జిల్లాతో పాటు పక్కనున్న జిల్లాల్లోనూ పాకింది..దీంతో జిల్లాలో రాజకీయ హీట్ పెంచింది..ఆ యువతితో మంత్రి చేసిన పర్సనల్ ఛాటింగ్ స్క్రీన్ షాట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి..ఈ ఛాటింగ్ వ్యవహారం ఇప్పుడు ఫేస్‌బుక్ ప్లాట్‌ ఫాం పైకి కూడా ఎక్కింది..ఇప్పడు ఆయన రాజకీయం భవిష్యత్‌పై రాష్ట్రవ్యాప్తంగా చర్చ సాగుతోంది.. చాటింగ్‌పై కొద్ది మందిని రకరకాల ప్రలోభాలతో తాత్కాలికంగా ఆపగలిగారు గానీ విషయం బైటకు రాకుండా మాత్రం అపలేకపోయారు..

ఛాటింగ్ వ్యవహారం సదరు యువతి రాష్ట్రంలోని ముఖ్య నేతలకు సోషల్ మీడియా ద్వారా సమాచారం చేరవేసింది..ఆ ముఖ్యనేతల ఆదేశాలతో నిఘా వర్గాలు రంగంలోకి దిగాయి.. మంత్రి గారి రాసలీల విషయంపై నిఘా వర్గాలు దృష్టి పెట్టారు..వైరల్ అవుతున్న ఈ స్క్రీన్ షాట్లపై పూర్తి వివరాలు సేకరించే పనిలో పడ్డాయి..సదరు ప్రజాప్రతినిధి ప్రాతినిథ్యం వహిస్తున్న ప్రాంతంలో ఆరా తీస్తున్నాయి..ఈ వ్యవహారంలో ఆ ముఖ్యనేత ప్రమేయంపై..ఆయనకు అండగా నిలుస్తున్న వారు ఎవరెవరనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.. ఎంతకాలంగా ఇది నడుస్తోంది, గతంలో ఇలాంటివేవైనా ఆ నేతుకు ఉన్నాయా..ఇలా అనేక రకాలుగా నిఘా వర్గాలు సమాచారాన్ని సేకరిస్తున్నాయి..

ఈ నెలలో ఆయన నియోజకవర్గంలోన జరిగిన ఓ షోనే పాల్గొన్నారు..ఈ షోకు హాజరైన యువతికి సంబంధించిన ఫోటోలు సీక్రెట్‌గా తీసి పంపించాలని ఆ ముఖ్యనేత ఒకరికి బాధ్యత అప్పగించారని తెలుస్తుంది.. ఆ యువతికి సంబంధించిన కొన్ని ఫోటోలు తీసి సదరు ముఖ్యనేతకు వాట్సప్ చేస్తున్న క్రమంలో రెడ్ హేండెడ్‌గా పట్టుబడినట్లు నిఘా వర్గాలు గుర్తించాయి..ఈ వ్యవహారాన్ని అర్థం చేసుకున్న ముఖ్యనేతలు ఆ ప్రబుద్ధుడికి చీవాట్లుపెట్టి డిసిప్లైన్ తప్పితే బావుండదని హెచ్చరించారు. అంతా సద్దుమణిగిందనుకుంటున్న తరుణంలో మరికొన్ని ఫిర్యాదులు అధిష్టానానికి వెళ్ళాయి. మళ్లీ విచారణ షురూ అయింది.

ఆ ప్రబుద్ధుడి భాగోతం స్క్రీన్ షాట్ల షేరింగ్‌తో ఊహించనంత వేగంగా వ్యాపిస్తోంది. ఒక్క రోజులోనే 20 నుండి 30 వేల వరకు సోషల్ మీడియాలో షేరింగ్ జరిగినట్టు అంచనా. సదరు ముఖ్యనేత ప్రాతినిథ్యం వహిస్తున్న నియోజకవర్గంతో పాటు రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో కూడా ఈ షేరింగ్ తంతు కొనసాగుతోంది. వాట్సప్‌లో అశ్లీలమైన ఛాట్ చేస్తూ రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోయిన ఆయనగారి పదవి ఉంటుందా పోతుందా అనే చర్చలు మొదలయ్యాయి..ఈ వ్యవహరంతో తనకు ఎలాంటి సంబంధం లేదని, స్క్రీన్ షాట్ల తంతుతో తమ నేతపై బురద జల్లుతున్నారని ఆయనగారి అతని అనుచరులు చెప్పుకొస్తున్నారు.. అయితే ఆ ప్రబుద్ధుడికి తగిన శాస్తి జరగాలని సోషల్ మీడియాలో ఆయనగారి స్క్రీన్ షాట్లను షేర్ చేస్తున్న నెటిజెన్లు కోరుకుంటున్నది.

Read more RELATED
Recommended to you

Latest news