తెలంగాణ నెక్ట్స్ సీఎం కేటీఆర్.. మల్లారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు

-

తెలంగాణలో రాష్ట్ర రాజకీయాలు చాలా రసవత్తరంగా మారాయి. ఇటీవలే జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. అప్పటి నుంచి రాష్ట్ర రాజకీయ పరిస్థితులు అన్నీ మారిపోయాయి. ఎప్పుడైతే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందో అప్పటి నుంచి పలు పార్టీలకు చెందిన కీలక నేతలు కాంగ్రెస్ పార్టీలోకి చేరేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు కొంత మంది నాయకులు పార్టీలు మారితే.. ఎంపీ ఎన్నికల ముందు పలువురు బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు.

తాజాగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎంపీలు కాంగ్రెస్ పార్టీలో చేరి కాంగ్రెస్ తరుపున ఎంపీ ఎన్నికల్లో బరిలోకి దిగుతున్నారు. ఇదిలా ఉంటే.. ఇవాళ బీఆర్ఎస్ కీలక నేత, మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు.  శామీర్ పేటలో కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పాల్గొన్న మల్లారెడ్డి మాట్లాడుతూ.. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో తెలంగాణను కేసీఆర్ దేశంలో నెంబర్ వన్ స్టేట్గా నిలిపారని అన్నారు. 75 ఏళ్లలో కాంగ్రెస్, బీజేపీలు ఏం చేయలేకపోయాయని తెలిపారు. తప్పకుండా మళ్లీ తామే అధికారంలోకి వస్తామని ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఐటీ రంగాన్ని కేటీఆర్ అభివృద్ధి చేసినంత మరెవరూ చేయలేదని అన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లోనూ మెజార్టీ సీట్లు
గెలుచుకుంటామన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news