తెలంగాణ PGECET ఫలితాలు విడుదల

-

రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పీజీ కళాశాలల్లో ఎంఈ, ఎంటెక్, ఎంఆర్క్, ఎం ఫార్మసి, డి ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన TG PGECET-2024 ప్రవేశ పరీక్ష ఫలితాలు మంగళవారం విడుదలయ్యాయి. ఈ మేరకు సాయంత్రం 4 గంటలకు కూకట్ పల్లిలోని జేఎన్టీయూహెచ్ గోల్డెన్ జూబ్లీ కాన్ఫరెన్స్ హాల్, అడ్మిషన్ భవనంలో ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ ఆర్.

లింబాద్రి, విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం ఫలితాలను విడుదల చేశారు. అధికారిక వెబ్సైట్ లింక్ https://pgecet.tsche.ac.in/ లో ఫలితాలను అందుబాటులో ఉంచారు. అభ్యర్థులు పీజీ ఈసెట్ రిజిస్ట్రేషన్ నెంబరు, హాల్టికెట్ నెంబరు, పుట్టిన తేదీ వివరాలు నమోదు చేసి ర్యాంకు కార్డులు పొందవచ్చని అధికారులు తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news