తెలంగాణ రాష్ట్ర ప్రజలకు బిగ్ అలర్ఠ్. తెలంగాణ రాష్ట్రంలో నేటి నుంచి మూడు రోజులపాటు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. తేలికపాటి నుంచి ఓ మోస్తారు వానలు పడే ఛాన్స్ ఉందని వెల్లడించింది.
అటు మూడు రోజులపాటు ఏపీలో భారీ వర్షాలు కురువనున్నాయి. ఈ మేరకు వాతావరణ శాఖ అధికారిక ప్రకటన చేసింది. ఉపరితల ఆవర్తన ప్రభావంతో ఈ నెల 26వ తేదీ నాటికి… బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడుతుందని అమరావతి వాతావరణ కేంద్రం ప్రకటించింది. 27వ తేదీ కల్లా అండమాన్ తీరంలో వాయుగుండంగా బలపడనుంది.
28వ తేదీన ఉత్తర ఈశాన్యంగా దిశ మార్చుకొని బంగ్లాదేశ్ వైపు ప్రయాణిస్తుందని… ఈ క్రమంలో బలపడి తుఫాన్ గా మారనుందని అంచనా వేసింది వాతావరణ శాఖ. వీటి ప్రభావంతో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా రాబోయే మూడు రోజుల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తారు వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ స్పష్టం చేసింది.