తెలంగాణ రాష్ట్ర ప్రజలకు చల్లటి కబురు. తెలంగాణ రాష్ట్రంలో వరుసగా వర్షాలు పడిన ఉన్నాయి. ఇవాళ అలాగే రేపు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ సూచించింది. తెలంగాణ రాష్ట్రంలో ఇవాళ రేపు కొన్ని జిల్లాలలో మోస్తారు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ నిపుణులు చెబుతున్నారు.
ముఖ్యంగా భూపాలపల్లి, కొత్తగూడెం, ములుగు, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, జనగామ, రంగారెడ్డి, భువనగిరి, నాగర్ కర్నూల్, వనపర్తి, గద్వాల అలాగే హనుమకొండ లాంటి జిల్లాలలో భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది వాతావరణ శాఖ. ఇటు ఉత్తర తెలంగాణ జిల్లాలలో కూడా వర్షాలు పడతాయని తెలిపింది. మధ్యప్రదేశ్ నైరుతి ప్రాంతంలో కేంద్రీకృతమైన ఆవర్తనంతో పాటు రాయలసీమ అలాగే తెలంగాణ ప్రాంతాలలో ఏర్పడిన ఆవర్తనం…. కారణంగా తెలంగాణ రాష్ట్రంలో వర్షాలు పడతాయని తెలిపింది హైదరాబాద్ వాతావరణ శాఖ. అటు ఏపీలో కూడా వర్షాలు కురుస్తాయని స్పష్టం చేసింది. ముఖ్యంగా హైదరాబాద్ మహానగరంలో మరో వారం రోజులపాటు చల్లటి వాతావరణంతో పాటు వర్షాలు పడతాయని తెలిపింది.