ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రైతులకు అదిరిపోయే శుభవార్త అందింది. ఇవాల్టి నుంచి రైతుల ఖాతాలలో పెట్టుబడి రాయితీని విడుదల చేయనుంది జగన్ సర్కార్. ఖరీఫ్ 2023 కరువు సహాయం, మౌచింగ్ తుఫాన్ నష్టపరిహారం అంటే ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వాల్టి నుంచి రైతు ఖాతాలలో ఏపీ ప్రభుత్వం జమచేయనుంది. 11.57 లక్షల మంది రైతుల ఖాతాలలో 1289 కోట్లు జమ చేయనుంది జగన్ సర్కార్.

ఖరీఫ్ రైతులకు 847 కోట్లు అందించనుంది. మౌచింగ్ బాధితులకు 442 కోట్ల సహాయం చేయనుంది. ఈసీ ఆంక్షలు సడలించడంతో ఇప్పటికే ఆసరా అలాగే విద్యా దీవెన నిధులను లబ్ధిదారుల ఖాతాలో జమ చేసిన జగన్మోహన్ రెడ్డి సర్కార్… ఇప్పుడు రైతుల ఖాతాలో కూడా డబ్బులు వేస్తోంది. దీంతో రైతులు ఫుల్ ఖుషి లో ఉన్నారు.