వ్యాక్సినేష‌న్‌లో తెలంగాణ రికార్డు.. 100 శాతం చేసిన తొలి రాష్ట్రం

-

వ్యాక్సినేష‌న్ ప్ర‌క్రియాలో తెలంగాణ రాష్ట్రం రికార్డు నెల‌కొల్పింది. 100 శాతం తొలి డోసు టీకాలు పంపిణీ చేసిన తొలి రాష్ట్రంగా తెలంగాణ రికార్డు సృష్టించింది. ఈ విష‌యాన్ని తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హ‌రీష్ రావు అధికారికంగా ప్ర‌క‌టించారు. తెలంగాణ‌లో ఇప్ప‌టి వ‌ర‌కు 5 కోట్ల కు పైగా వ్యాక్స‌న్ల పంపిణీ జ‌రిగింద‌ని ఆయ‌న తెలిపారు. ఈ ఘ‌న‌త ను సాధ్యం చేసిన రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ అధికారులకు, టీకా డోసుల‌ను పంపిణీ చేసిన సిబ్బందికి మంత్రి హ‌రీష్ రావు అభినంద‌న‌లు తెలిపారు.

harishrao
harishrao

రాష్ట్రంలో ఇప్ప‌టి వ‌ర‌కు ఐదు కోట్ల టీకాల‌ను పంపిణీ చేశామ‌ని తెలిపారు. అందులో 2.93 కోట్లు మొద‌టి డోసు అని తెలిపారు. అలాగే 2.06 రెండో డోసు అని, బూస్ట‌ర్ డోసు గా 1.09 ల‌క్ష‌ల టీకాలు పంపిణీ చేశామ‌ని వివ‌రించారు. రాష్ట్రంలో కేవ‌లం 35 రోజుల్లోనే కోటి టీకాల‌ను పంపిణీ చేశామ‌ని తెలిపారు. గురువారం ఒక్క రోజే 2,16,538 టీకాలు పంపిణీ జ‌రిగింద‌ని అన్నారు. 100 శాతం మొద‌టి డోసు.. 74 శాతం రెండో డోసు వ్యాక్సినేష‌న్ ప్ర‌క్రియ జ‌రిగింద‌ని తెలిపారు. అలాగే రాష్ట్రంలో ప్ర‌తి ఒక్క‌రు కూడా రెండు డోసుల టీకాల‌ను తీసుకోవాల‌ని ప్ర‌జ‌లకు ఆయ‌న సూచించారు.

Read more RELATED
Recommended to you

Latest news