కార్తిక మాసం స్పెషల్.. శైవ క్షేత్రాలకు TSRTC ప్రత్యేక బస్సులు

-

కార్తిక మాసాన్ని పురస్కరించుకుని తెలంగాణ ప్రజలకు ఆర్టీసీ గుడ్ న్యూస్ చెప్పింది. తెలుగు రాష్ట్రాల్లోని పుణ్యక్షేత్రాలకు వెళ్లేందుకు భక్తుల కోసం ఓ స్పెషల్ కార్యక్రమాన్ని తీసుకువచ్చింది. భక్తుల సౌలభ్యం కోసం ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు తెలంగాణ ఆర్టీసీ తెలిపింది. భక్తులంతా ఈ సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకోవాలని రంగారెడ్డి రీజినల్‌ మేనేజర్‌ ఎ.శ్రీధర్‌ సూచించారు.

కార్తికమాసం సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లో తెలంగాణ ఆర్టీసీ స్పెషల్ బస్సులు నడుపుతున్న ప్రధాన శైవక్షేత్రాలు ఇవే.. 

తెలంగాణ: వేములవాడ, కాళేశ్వరం, రామప్పగుడి, వెయ్యి స్తంభాల గుడి, పాలకుర్తి తదితర దక్కన్‌ పంచశైవ క్షేత్రాలకు బస్సులు నడుపుతున్నట్లు తెలిపారు. ప్రతి ఆదివారం, కార్తిక పౌర్ణమి ముందురోజు మధ్యాహ్నం 2 గంటలకు హైదరాబాద్‌ నుంచి బయలుదేరి దర్శనం అనంతరం సోమవారం రాత్రికి నగరానికి చేరుకుంటాయన్నారు. టిక్కెట్‌ ఛార్జీలు రాజధాని రూ.2400, సూపర్‌లగ్జరీ రూ.1900, ఎక్స్‌ప్రెస్‌ రూ.1500గా నిర్ణయించామన్నారు.

ఆంధ్రప్రదేశ్‌: అమరావతి, భీమవరం, పాలకొల్లు, ద్రాక్షారామం, సామర్లకోటలలోని పంచారామ క్షేత్రాలకు బస్సులు ఏర్పాటు చేశామన్నారు. ప్రతి ఆదివారం, పౌర్ణమి ముందు రోజు సాయంత్రం 5 గంటలకు హైదరాబాద్‌ నుంచి బయలుదేరి మంగళవారం మధ్యాహ్నం 12 గంటలకు తిరిగి నగరానికి చేరుకుంటాయని తెలిపారు. టిక్కెట్‌ ఛార్జీలు రాజధాని రూ.4 వేలు, సూపర్‌లగ్జరీ రూ.3200. దర్శనం, వసతి కోసం రూ.550 అదనంగా చెల్లించాల్సి ఉంటుందన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news