రైతులకు గుడ్ న్యూస్.. రుణమాఫీ కాని వివరాల నమోదుకు ప్రత్యేక యాప్‌

-

రైతులకు శుభవార్త. అర్హులై ఉండి రేషన్‌కార్డు లేక, ఇతర కారణాల వల్ల రుణమాఫీ వర్తించని రైతులకు ప్రభుత్వం తీపికబురు చెప్పింది. వారి వివరాల నమోదుకు ‘రైతు భరోసా పంట రుణమాఫీ యాప్‌’ను రాష్ట్ర వ్యవసాయశాఖ అందుబాటులోకి తీసుకువచ్చింది. దీన్ని అన్ని జిల్లాల వ్యవసాయాధికారులు, డివిజన్, మండల అధికారులు, విస్తరణాధికారులకు పంపించింది.

ఇందులో భాగంగా అధికారులు రుణమాఫీ వర్తించని వారి ఇళ్లకు వెళ్లి క్షేత్రస్థాయి సమాచారం తెలుసుకోవాలి. ఆ వివరాలు యాప్‌లో నమోదు చేయాలి. అనంతరం రైతుల నుంచి ధ్రువీకరణపత్రం, స్థానిక పంచాయతీ కార్యదర్శి సంతకం తీసుకోవాలి. ముందుగా ప్రయోగాత్మకంగా కొందరి రైతుల వివరాలను నమోదు చేసి పరీక్షించాలని అధికారులకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. మంగళవారం నుంచి సర్వే ద్వారా యాప్‌లో వివరాల నమోదు ప్రక్రియ ప్రారంభం కానుంది. మరోవైపు రూ.2 లక్షలు దాటిన వారికి అదనపు మొత్తాలను వసూలు చేసేందుకు బ్యాంకులకు వ్యవసాయ శాఖ అనుమతులు జారీ చేసింది. దీంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news