తెలంగాణ విద్యార్థులకు శుభవార్త. గురుకుల హాస్టల్‌లో మెస్ చార్జీల పెంపు దిశగా అడుగులు వేస్తోంది తెలంగాణ రాష్ట్ర సర్కార్. గురుకులాల్లో మెస్ చార్జీలు పెంచుతున్నామని మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రకటన చేశారు. పెరిగిన నిత్యవసరాలు ధరలను దృష్టిలో పెట్టుకొని గురుకుల హాస్టల్‌లో మెస్ చార్జీలు పెంచబోతున్నామని వివరించారు మంత్రి పొన్నం ప్రభాకర్.
పెరిగిన ధరలకు అనుగుణంగా విద్యార్థులకు మెస్ చార్జీలు పెంచేందుకు ప్రభుత్వం చర్చలు జరుపుతోంది, త్వరలోనే విద్యార్థులకు శుభవార్త చెప్తామన్నారు. విద్యారంగ సమస్యలకు 5,000 కోట్ల రూపాయలు కేటాయించామని… అసౌకర్యాలతో ఉన్న అన్ని విద్యాసంస్థలకు స్థలాల కేటాయింపు జరిపి పక్క భవనల నిర్మాణం చేపడతామని వెల్లడించారు. హుస్నాబాద్ నియోజకవర్గంలో 42 రైతు వేదికల ద్వారా యువ రైతులకు విజ్ఞప్తి చేస్తున్నానని… యువరైతులకు వ్యవసాయాధారిత పరిశ్రమలను ఏర్పాటు చేసుకోవడానికి ప్రభుత్వం తరపున అవసరమైన రుణాలు ఇప్పించేందుకు కృషి చేస్తున్నానని చెప్పారు.హుస్నాబాద్ లో యువరైతులకు వ్యవసాయ ఆధారిత పథకాలకు అవసరమైన రుణాలు ఇప్పించేందుకు నేను, యంత్రాంగం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నామని తెలిపారు.