Telangana : ఈ ఏడాది రవాణాశాఖ టార్గెట్ రూ.8,478 కోట్లు

-

ఆదాయాన్ని భారీగా పెంచుకోవడంపై తెలంగాణ రవాణా శాఖ దృష్టి సారించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి రూ.8,478 కోట్ల భారీ రాబడి లక్ష్యంగా పెట్టుకున్న సర్కార్ ఆ దిశగా కార్యాచరణపై ఫోకస్ పెట్టింది. ఈ శాఖలో రాబడి పరంగా చూస్తే పొరుగున మహారాష్ట్ర, దక్షిణాది 5 రాష్ట్రాల్లో.. తెలంగాణ 4వ స్థానంలో ఉంది.

రాబడి సమకూర్చే కీలక శాఖల్లో ఒకటైన రవాణా శాఖకు 2024-25లో జీవిత కాల పన్ను రూ.6,024.97 కోట్లు, త్రైమాసిక పన్ను, గ్రీన్‌ ట్యాక్స్‌ రూ.75.68 కోట్లు, ఫీజులు రూ.648.10 కోట్లు, ట్రాఫిక్‌ చలాన్ల రూపంలో రూ.300 కోట్లు, బకాయిల వసూలు రూ.186.03 కోట్లు, యూజర్‌ ఛార్జీలు రూ.159.65 కోట్లు ఆర్జించాలని ఆర్థిక శాఖ నిర్దేశించింది. మరోవైపు ఇటీవల ఇతర రాష్ట్రాల్లోని విధానాలపై అధ్యయనం చేసిన అధికారులు నివేదికను  రవాణా శాఖకు అందించగా.. త్వరలో ఈ అంశంపై సమావేశం జరగనున్నట్లు సమాచారం. అనంతరం అవినీతి, అక్రమాలకు ఆస్కారం కల్పిస్తున్న రవాణా చెక్‌పోస్టుల ఎత్తివేత వంటి చర్యలుండే అవకాశం ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news