ప్రైవేట్ ఉద్యోగాల రిజర్వేషన్లపై వెనక్కి తగ్గిన సిద్ధరామయ్య

-

కర్ణాటకలోని ప్రైవేటు సంస్థల్లో కన్నడిగులకు రిజర్వేషన్లు కల్పించే బిల్లుపై ఆ రాష్ట్ర ప్రభుత్వం వెనక్కి తగ్గింది. పరిశ్రమ వర్గాల నుంచి పెద్దఎ త్తున వ్యతిరేకత రావడం వల్ల బిల్లును తాత్కాలికంగా నిలిపివేసినట్లు వెల్లడించింది. సోమవారం ఈ బిల్లుకు కర్ణాటక కేబినెట్ ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. ఇవాళ అసెంబ్లీలో ప్రవేశపెట్టాలని భావించిన సర్కార్.. తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైన నేపథ్యంలో బిల్లును తాత్కాలికంగా నిలిపివేసినట్లు తెలిపింది. దీనిపై రానున్న రోజుల్లో సమీక్షించి తుది నిర్ణయం తీసుకోనున్నట్లు కర్ణాటక ముఖ్యమంత్రి కార్యాలయం  వెల్లడించింది.

అంతకుముందు కర్ణాటక నూతన పరిశ్రమల బిల్లు యోచనపై నేషనల్‌ అసోసియేషన్ ఆఫ్‌ సాఫ్ట్‌వేర్‌ అండ్‌ సర్వీస్‌ కంపెనీస్‌(నాస్కామ్‌) తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. కర్ణాటక అభివృద్ధిలో టెక్‌ సంస్థలది కీలకపాత్రని, ఆంక్షలు విధిస్తే కంపెనీలు తరలివెళ్లే ప్రమాదం ఉందని నోట్‌ విడుదల చేసింది. ఇలాంటి నిర్ణయాలతో కంపెనీలు కర్ణాటక నుంచి వెళ్లిపోతాయని, పెట్టుబడులు ఆగిపోతాయని .. ఇలాంటి చర్యల కంటే స్థానికులకు నైపుణ్యాలు మెరుగుపరిచే దిశగా కర్ణాటక ప్రభుత్వం దృష్టి సారించాలని సూచించింది.

Read more RELATED
Recommended to you

Latest news