తెలంగాణలో నేడు, రేపు అతి భారీ వర్షాలు.. ఆ జిల్లాలకు హై అలర్ట్

-

తెలంగాణ మెల్లగా చల్లబడుతోంది. రాష్ట్రంలో నెమ్మదిగా వర్షాలు ప్రారంభమవుతున్నారు. అయితే రానున్న రోజుల్లో భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ముఖ్యంగా రాష్ట్రంలో ఉత్తర తెలంగాణలోని 8 జిల్లాలకు వాతావరణశాఖ అతి భారీ వర్షసూచన జారీ చేసింది. శని, ఆదివారాల్లో కురిసే ప్రాంతాలకు హెచ్చరికలను జారీ చేసింది.

ఇవాళ ఆదిలాబాద్‌, ఆసిఫాబాద్‌, మంచిర్యాల, నిర్మల్‌, కరీంనగర్‌, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో 115.6 – 204.4 మి.మీ.ల వర్షపాతం నమోదయ్యే అవకాశాలున్నట్లు పేర్కొంది. మరో ఏడు జిల్లాల్లో 64.5 – 115.5 మి.మీ.ల మధ్య వర్షాలు కురుస్తాయని సూచించింది. ఈ జిల్లాల్లో విపత్తు స్పందన దళాలు అప్రమత్తం కావాలని ఐఎండీ సూచించింది.

నైరుతి రుతుపవనాలు శుక్రవారం నాటికి నిజామాబాద్‌ జిల్లాలో కొంత భాగం వరకు విస్తరించాయి. కామారెడ్డి, సంగారెడ్డి, మెదక్‌, వికారాబాద్‌ జిల్లాలతోపాటు ఆదిలాబాద్‌ జిల్లాలో కొంత భాగం వ్యాపించాల్సి ఉంది. ఆదివారం నాటికి రాష్ట్రమంతటా విస్తరిస్తాయని వాతావరణశాఖ అంచనా వేస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news