కేసీఆర్ చేతిలో ఉంటేనే తెలంగాణ బాగుంటుంది – హరీష్ రావు

-

సీఎం కేసీఆర్ చేతిలో ఉంటేనే తెలంగాణ బాగుంటుందని అన్నారు మంత్రి హరీష్ రావు. ఇతరుల చేతులలోకి వెళితే ఆగం అవుతుందన్నారు. నేడు సంగారెడ్డి జిల్లాలో సంగమేశ్వర ఎత్తిపోతల ప్రాజెక్టు నిర్మాణ పనులకు భూమి పూజ చేసిన అనంతరం మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ.. సంగమేశ్వర ఎత్తిపోతల పథకం పూర్తి అయితే సంగారెడ్డి జిల్లా సస్యశ్యామలం అవుతుందన్నారు. తెలంగాణ రావడం, కేసీఆర్ సీఎం కావడం వల్లే ఈ ప్రాజెక్టు వచ్చిందన్నారు.

పేదలు, రైతుల సంక్షేమమే అజెండాగా ప్రభుత్వం పని చేస్తుందన్నారు. ఆనాటి ప్రభుత్వాలు వ్యవసాయం దండగా అంటే.. కేసీఆర్ మాత్రం వ్యవసాయాన్ని పండగ చేసి చూపించారని అన్నారు. రైతు దగ్గర ప్రతి గింజ ప్రభుత్వమే ఉంటుందని అన్నారు మంత్రి హరీష్ రావు. ఎన్నికలు వచ్చినప్పుడు చాలామంది వస్తుంటారని.. వారిని పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news