BREAKING : బండి సంజయ్‌ పాదయాత్రలో ఉద్రిక్తత..పాదయాత్రను అడ్డుకున్న టీఆర్‌ఎస్‌ కార్యకర్తలు !

-

BREAKING : తెలంగాణ రాష్ట్ర భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్‌ పాదయాత్రలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. బండి సంజయ్‌ నిర్వహిస్తున్న పాదయాత్రను అడ్డుకునే ప్రయత్నం చేశారు టీఆర్‌ఎస్‌ పార్టీ కార్యకర్తలు. ఇవాళ బండి సంజయ్‌.. గద్వాల జిల్లా ఇటిక్యాల మండలం వేములలో పాదయాత్ర చేస్తున్నారు.

ఈ నేపథ్యంలోనే.. బండి సంజయ్‌ పాదయాత్రను టీఆర్‌ఎస్‌ పార్టీ నాయకులు అడ్డుకునే ప్రయత్నం చేసారు. అటు బీజేపీ కార్యకర్తలు కూడా.. వారిని ధీటుగా ఎదుర్కొన్నారు. వీరిద్దరి మధ్య ఘర్షణలో కార్ల అద్దాలు కూడా పగిలాయి. ఈ నేపథ్యంలోనే.. ఘటన స్థలానికి స్థానిక పోలీసులు చేరుకుని.. ఇరు వర్గాలను చెదరగొట్టారు. దీంతో… అక్కడి పరిస్థితులు సాధారణ స్థాయికి చేరుకున్నాయి. అయితే.. ఈ దాడి ఘటనపై బండి సంజయ్‌ స్పందించారు. తెలంగాణ రాష్ట్ర రైతులు, నిరుద్యోగులు, పేదలు, అన్ని వర్గాల ప్రజల కోసం.. ఎలాంటి దాడులనైనా ఎదుర్కొంటాం.. ముందుకు సాగుతామని చెప్పారు.

Read more RELATED
Recommended to you

Latest news