నేడు బీఆర్ఎస్ నేతలు హరీష్ రావు, పువ్వాడ అజయ్, సబితా ఇంద్రారెడ్డి, కౌశిక్ రెడ్డి, జగదీష్ రెడ్డి, ఇతర మాజీ ఎమ్మెల్యేలు ఖమ్మం జిల్లాలో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఖమ్మం జిల్లాలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఖమ్మం జిల్లాలోని బి.కె.నగర్ లో బీఆర్ఎస్ నేతల వాహనాలపై గుర్తుతెలియని వ్యక్తులు రాళ్ల దాడికి పాల్పడ్డారు.
హరీష్ రావు, పువ్వాడ అజయ్, నామ నాగేశ్వరరావు వాహనాలపై కూడా దాడి చేసినట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో ఇద్దరికీ తీవ్ర గాయాలు అయ్యాయి. ఈ రాళ్ల దాడిలో బిఆర్ఎస్ కార్యకర్త సంతోష్ రెడ్డి కాలికి తీవ్ర గాయమైంది. బాధితులను ఆసుపత్రికి తరలించారు.
ఘటన అనంతరం మాజీ మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ.. వరద బాధితులను ఆదుకోవడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందన్నారు. కేంద్రం నుంచి ఎన్డీఆర్ఎఫ్ బృందాలు ఎందుకు రాలేదని ప్రశ్నించారు. ప్రజల ప్రాణాలను కాపాడడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమైయ్యాయని మండిపడ్డారు హరీష్ రావు.