హాస్టల్ వెల్పేర్ ఆఫీసర్ పోస్టులకు పరీక్ష తేదీలు ప్రకటించిన TGPSC

-

తెలంగాణలో ఖాళీగా ఉన్న 581 హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ గ్రేడ్-1, గ్రేడ్-2, వెల్ఫేర్ అండ్ లేడీ సూపరింటెండెంట్ సహా పలు ఉద్యోగాలకు సంబంధించి పరీక్ష షెడ్యూలును తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆదివారం రిలీజ్ చేసింది. కంప్యూటర్ బేస్డ్ రిక్రూట్మెంట్ టెస్ట్ జరగనుండగా.. జనరల్ స్టడీస్ ఈ నెల 24న నుంచి 28 వరకు జరగనుంది. పేపర్ I పరీక్ష ఉదయం 10 గంటల నుంచి 12.30 గంటల వరకు జరుగనుంది.

అలాగే పేపర్ II (ఎడ్యుకేషన్) మధ్యాహ్నం 2.30 గంటల నుంచి 5 గంటల వరకు జరగనుంది. 29న ఉదయం 10 గంటల నుంచి 12.30 గంటల వరకు జరుగుతుంది. జనరల్ స్టడీస్ ఒక సెషన్ లో నిర్వహించనున్నారు. అనంతరం రెండో సెషన్ పేపర్ ॥ (ఎడ్యుకేషన్)ను మధ్యాహ్నం 2.30 గంటల నుంచి 5 గంటల వరకు నిర్వహించనున్నారు. డిప్లొమా ఇన్ స్పెషల్ ఎడ్యుకేషన్ (విజువల్ ఇంపేర్మెంట్) పరీక్షను మధ్యాహ్నం 2.30 గంటల నుంచి 5 గంటల వరకు డిప్లొమా ఇన్ స్పెషల్ ఎడ్యుకేషన్ (హియరింగ్ ఇంపేర్ మెంట్) నిర్వహించనున్నారు. పరీక్షల మూడు రోజుల ముందు నుంచి హాల్ టికెట్లు డౌన్ లోడ్ చేసుకోవచ్చిన టీజీపీఎస్సీ తెలిపింది.

Read more RELATED
Recommended to you

Latest news