గంజాయి, డ్రగ్స్ పై ప్రభుత్వం ఉక్కు పాదం మోపుతోంది : మంత్రి సీతక్క

-

గంజాయి, డ్రగ్స్ పై ప్రభుత్వం ఉక్కు పాదం మోపుతోంది తెలంగాణ గిరిజన శాఖ మంత్రి సీతక్క తెలిపారు. ఈనెల 13న రాత్రి ఆరేళ్ల చిన్నారి పై లైంగిక దాడికి పాల్పడి, హత్య చేసిన ఘటన పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలంలో చోటు చేసుకుంది. ఈ ఘటనపై తాజాగా పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మంత్రులు సీతక్క, శ్రీధర్ బాబు మీడియా సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ.. రాష్ట్రంలో, దేశంలో ఎక్కడో ఒక చోట ఇలాంటి ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. ఇందుకు ప్రధాన కారణం గంజాయి, డ్రగ్స్.. మత్తుకు అలవాటు పడి వావి వరస అనే తేడా లేకుండా ఇలాంటి నేరాలకు పాల్పడుతున్నారని తెలిపారు. తల్లిదండ్రుల మధ్య పడుకున్న చిన్నారిని తీసుకెళ్లి అత్యాచారం, హత్య చేసిన ఘటన చాలా బాధాకరమని తెలిపారు. ఈ ఘటన పై ప్రభుత్వం చాలా సిరియస్ గా తీసుకుంది. రాత్రి వేళలో పోలీసులు గస్తీ పెంచాలని ఆదేశించారు. పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయాలని సూచించారు. గంజాయి, డ్రగ్స్ రహిత రాష్ట్రంగా ఉండాలనేది తెలంగాన ముఖ్యమంత్రి లక్ష్యం అని తెలిపారు. బాధిత కుటుంబాన్ని ప్రభుత్వం  అన్ని రకాలుగా  ఆదుకుంటుందని భరోసా ఇచ్చారు మంత్రి సీతక్క.

 

Read more RELATED
Recommended to you

Latest news