హత్యలు, అత్యాచారాలకు కారణం అదే.. మంత్రి సీతక్క కీలక వ్యాఖ్యలు

-

రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ సర్కార్ రాష్ట్రంలో మత్తు పదార్థాలపై ఉక్కుపాదం మోపాలని అధికారులను ఆదేశించింది. ప్రభుత్వ ఆదేశాల మేరకు అధికారులు రాష్ట్ర వ్యాప్తంగా ముమ్మరంగా తనిఖీలు చేపడుతున్నారు. ఈ క్రమంలో మత్తు పదార్థాల నిర్మూలనపై సంబంధిత అధికారులతో బుధవారం మంత్రి సీతక్క సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. గంజాయి విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే అధికారులను ఉపేక్షించేది లేదని తేల్చి చెప్పారు. హత్యలు, అత్యాచారాలకు కారణం మత్తేనని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇతర రాష్ట్రాల నుండి గంజాయి, డ్రగ్స్, ఇతర మత్తు పదార్థాలపై పటిష్ట నిఘా పెట్టాలని సూచించారు. రాష్ట్రంలో పూర్తి స్థాయిలో గంజాయిని నియంత్రించాలని సీతక్క అధికారులకు సూచించారు.

Read more RELATED
Recommended to you

Latest news