కొండా దంపతులపై మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలకు ఘాటుగా స్పందించారు కొండా మురళి. మంత్రి కేటీఆర్ పై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తాను రౌడీని అయితే టిఆర్ఎస్ లో ఎందుకు చేర్చుకున్నారని, ఎమ్మెల్సీ ఎందుకు ఇచ్చారని ప్రశ్నించారు. పేదలకు సేవ చేస్తే రౌడీ అనుకుంటే తనకు ఎటువంటి అభ్యంతరం లేదన్నారు కొండా మురళి. శ్రీకృష్ణదేవరాయల వంశీయులం కాబట్టే మీసాలు పెంచుతామని.. కేటీఆర్ అటూ ఇటూ కాదు కాబట్టి ఆయనకు మీసాలు రావని సంచలన వ్యాఖ్యలు చేశారు.
కేటీఆర్ కి తన పేరు ఉచ్ఛరించే దమ్ము కూడా లేదన్నారు. తాను నియోజకవర్గంలో సరిగ్గా తిరిగితే కేటీఆర్ కి ఉచ్చ పడుతుందన్నారు. వరంగల్ తూర్పు నియోజకవర్గం లో కొండా సురేఖ గెలిచి తీరుతుందని ధీమా వ్యక్తం చేశారు. చదువురాని దయాకర్ రావును మంత్రిని చేసి, మేధావి అయిన కడియం శ్రీహరిని పక్కకు పెట్టారని దుయ్యబట్టారు.