చనిపోయారు అనుకున్నవాళ్లు బతికి వస్తే ఎంత సంతోషంగా ఉంటుందో కదా.. మీరు చూసే ఉంటారు.. సాధారణంగా ఎవరైనా చనిపోతే.. వారి మీద పడిపోయి ఒక్కసారి లేవరా, లేచి చూడు అని ఏడుస్తుంటారు. వాళ్లు మళ్లీ తిరిగి రారని తెలుసు.. కానీ అలానే ఏడుస్తారు. ఇక్కడ ఓ యువకుడు చనిపోయాడనుకోని.. అంత్యక్రియలు చేసేందుకు కూడా తీసుకెళ్లారు. చితిమీద పడుకోబెడితే.. అప్పుడు లేచాడు. కానీ ఆ తర్వాత పెద్ద హెడ్రామా నడిచింది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
మధ్యప్రదేశ్… మొరెనా నగరంలోని 47వ వార్డుకి చెందిన జీతూ ప్రజాపతి చాలా కాలంగా కిడ్నీ సంబంధిత సమస్యలతో బాధపడుతున్నాడు. మే 30న అకస్మాత్తుగా ఆయన ఆరోగ్యం క్షీణించింది. అతడి శరీరంలో ఎలాంటి కదలికా లేకపోవడంతో బంధువులు మృతి చెంది ఉంటాడని భావించారు. ఆ సమయంలో అతని ముక్కుపై వేలు ఉంచి.. శ్వాసను చెక్ చేశారు. అలాగే.. ఛాతీపై చెవి ఆనించి.. గుండె లయను చెక్ చేశారు. ఎలాంటి స్పందనా రాకపోవడంతో అతను పోయాడనుకున్నారు. వెంటనే బంధువులు, ఇరుగుపొరుగు వారికి ఫోన్ చేసి శవపేటిక సిద్ధం చేశారు. బంధువులు జీతూ అంత్యక్రియలకు ఏర్పాట్లు చేసి.. విశ్రాంఘాట్‌కి తీసుకెళ్లారు. అక్కడ చితిని సిద్ధం చేశారు. కాసేపట్లో తగలబెట్టాల్సి ఉండగా.. అతనిలో కదలిక వచ్చింది.
అది చూసిన బంధువులు షాక్ అయ్యారు. వెంటనే డాక్టర్‌ని అక్కడికి పిలిపించారు. డాక్టర్ టెస్ట్ చేసి.. ECG, ట్రీట్‌మెంట్ కోసం గ్వాలియర్‌కు తీసుకెళ్లారు. జీతూ పరిస్థితి విషమంగా ఉండడంతో ఆస్పత్రిలో చేర్పించారు. ఆస్పత్రిలో ఎమర్జెన్సీ ట్రీట్‌మెంట్ చేసిన డాక్టర్లు.. ఆ తర్వాత అతని పరిస్థితి ఎలా ఉందో వెంటనే చెప్పలేదు. అరగంట తర్వాత చెబుతామన్నారు. దాంతో కుటుంబ సభ్యులతో పాటూ.. ఊరిజనం కూడా అతని బతికే ఉన్నాడా లేక చనిపోయాడ అర్థంకాక నానా హైరానా పడ్డారు.
అరగంట తర్వాత డాక్టర్ వచ్చి.. జీతూ బతికే ఉన్నాడని చెప్పడంతో కుటుంబ సభ్యులు ఊరట చెందారు. ఈ ఘటన అందర్ని ఆశ్చర్యానికి గురిచేసింది. ఏది ఏమైనా బతికి ఉండగానే ఆ ఘట్టాన్ని చివరి అంచుల వరకూ చేసేశారు..!