కేంద్రానికి కౌంట్ డౌన్ మొదలైంది – అఖిలేష్ యాదవ్

-

కేంద్రానికి కౌంటు డౌన్ మొదలైందని హెచ్చరించారు ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, సమాజ్వాది పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్. ఖమ్మం జిల్లాలో ఏర్పాటుచేసిన భారత రాష్ట్ర సమితి బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ.. విపక్షాలు అధికారంలో ఉన్న రాష్ట్రాలలో ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి ప్రభుత్వాలను కూల్చేందుకు బీజేపీ ప్రయత్నిస్తుందని ఆరోపించారు. చారిత్రాత్మక ఖమ్మం జనసంద్రంగా మారిందన్నారు. ఖమ్మం ప్రజలు రాజకీయంగా చైతన్యవంతులు అన్నారు అఖిలేష్ యాదవ్.

కేంద్ర ప్రభుత్వం బిజెపి ఇతర రాష్ట్రాలను ఇబ్బంది పెడుతుందన్నారు. విపక్ష పార్టీల నేతలను కేసులపేరుతో ఇరుకున పెట్టేందుకు కేంద్రం ప్రయత్నిస్తుంది అన్నారు. దర్యాప్తు సంస్థలను చూపి భయపెట్టాలని చూస్తుందని ఆరోపించారు. నరేంద్ర మోడీకి ఇంకా 400 రోజులే మిగిలి ఉన్నాయని అన్నారు. నిరుద్యోగులకు ఉపాధి కల్పిస్తామని చేతులెత్తేసారని మండిపడ్డారు. రైతులని ఆదుకుంటామని చెప్పి మాట తప్పారని అన్నారు. తెలంగాణలో బిజెపి ప్రక్షాళన జరుగుతున్నట్లే యూపీలోను జరుగుతుందన్నారు అఖిలేష్ యాదవ్. కేంద్రానికి కౌంట్ డౌన్ మొదలైంది అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news