దేశానికి కావలసింది డబుల్ ఇంజన్లు కాదు..డబుల్ ఇంపాక్ట్ పాలన: మంత్రి కేటీఆర్

-

కేంద్ర ప్రభుత్వం పై రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ సెటైరికల్ ట్వీట్ చేశారు. దేశ ప్రజలను మోసం చేస్తూ, తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం చేస్తుందంటూ కేంద్రంపై కేటీఆర్ ధ్వజమెత్తారు. దేశానికి కావాల్సింది డబుల్ ఇంజన్లు కాదని.. డబుల్ ఇంపాక్ట్ పాలన అని చెప్పారు. పనికి రాని డబుల్ ఇంజన్లు కాదు అని కేటీఆర్ ట్వీట్ లో తెలిపారు. దేశ జనాభాలో 2.5 శాతం ఉన్న తెలంగాణ.. దేశ జీడీపీ కి 5.0 శాతం కాంట్రిబ్యూట్ చేస్తోందని కేటీఆర్ అన్నారు.

ఈ గణాంకాలు 2021 అక్టోబర్ లో ఆర్బీఐ విడుదల చేసిన నివేదికలోనివేనని కేటీఆర్ తన ట్విట్టర్లో పేర్కొన్నారు. కాగా నేడు( సోమవారం) హైదరాబాదులో అడ్వాన్స్ ఆటో పార్ట్స్ గ్లోబల్ కేపాబిలిటి సెంటర్ ను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో టామ్ గ్రీకో- అడ్వాన్స్ ఆటో పార్ట్స్ ప్రెసిడెంట్& సీఈఓ, ఐటి శాఖ ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్ పాల్గొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news