చంద్రబాబు దద్దమ్మ, సన్నాసి, అసమర్థుడు: జోగి రమేష్

-

భారత దేశ చరిత్రలో ఏ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి కూడా జరగని విధంగా 30 లక్షల మందికి ఇళ్లు ఇచ్చే విధంగా సీఎం జగన్ కార్యక్రమాలు చేస్తున్నారని మంత్రి జోగి రమేష్ అన్నారు. ఇవన్నీ టీడీపీ అనుకూల మీడియాకు కనిపించవని ఆయన అన్నారు. ఈనాడు రామోజీరావుకు ఇవన్నీ కనిపించడం లేదని.. రామోజీ రావుకు కేవలం అబద్ధాలు కనిపిస్తాయని విమర్శించారు.jogi ramesh చంద్రబాబు ఓ దద్దమ్మ, అసమర్థుడు, సన్నాసి కనుకే పేదలకు మంచి చేసే ప్రయత్నం చేయలేదు. ప్రజల గురించి ఏ రోజూ పట్టించుకోలేదని విమర్శించారు. జగన్ ఓ వీరుడిలాగా అక్కచెల్లమ్మలకు ఇళ్లను కట్టిస్తున్నాడని అన్నారు. చంద్రబావు హయాంలో ఊరికి ఒక ఇల్లు కట్టి ఉంటారని..జగన్ ప్రభుత్వంలో ఊర్ల నిర్మాణాలు జరుగుతున్నాయని ఆయన అన్నారు. ఏ వర్గం కూడా చంద్రబాబును నమ్మే పరిస్థితి లేదని ఆయన అన్నారు. రైతులు జగన్ పాలనలో సంతోషంగా ఉన్నారని అన్నారు. చంద్రబాబు కుట్రలను ప్రజలు గమనిస్తున్నారని.. చంద్రబాబకు తగిన శాస్త్రి జరగి తీరుతుందని విమర్శించారు.

 

Read more RELATED
Recommended to you

Latest news