మద్యంపై ఉన్న ధ్యాస-మద్దతు ధరపై లేకపాయే.. కేటీఆర్ ఆసక్తికర ట్వీట్..!

-

తెలంగాణలో ప్రస్తుతం మూసీ నదిపై వివాదం జరుగుతున్న విషయం తెలిసిందే. మూసీ పై మొన్న సీఎం రేవంత్ రెడ్డి సచివాలయం లో ప్రజెంటేషన్ ఇస్తే.. నిన్న తెలంగాణ భవన్ లో తొలుత హరీశ్ రావు సీఎం రేవంత్ రెడ్డికి కౌంటర్ ఇచ్చారు. ఎక్కడికైనా వస్తా.. ఫస్ట్ మూసీ వద్దకు పోదాం. అక్కడి నుంచి ఎక్కడికైనా పోదాం అని సవాల్ చేశారు హరీశ్ రావు. అనంతరం మూసీ పై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రజెంటేషన్ ఇచ్చారు. మూసీ అభివృద్ధికి 25వేల కోట్లు అవసరం అవుతాయని.. లక్షయాబై వేల కోట్లు అని మిగిలించి రాహుల్ గాంధీకి పంపించాలని అనుకుంటున్నాడు రేవంత్ రెడ్డి అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. 

తాజాగా కేటీఆర్ ఆసక్తికర ట్వీట్ చేశాడు. “మద్యంపై ఉన్న ధ్యాస – మద్దతు ధరపై లేకపాయే మద్యంపై ఉన్న ధ్యాస – మంచి బోధనపై లేకపాయే. మద్యంపై ఉన్న ధ్యాస – మందుబిళ్లలపై లేకపాయే. మద్యం పై ఉన్న ధ్యాస – మూసి బాధితులపై లేకపాయే. మద్యంపై ఉన్న ధ్యాస – మంచినీళ్లపై లేకపాయే. మద్యంపై ఉన్న ధ్యాస – పింఛన్ పెంపు పై లేకపాయే. మద్యంపై ఉన్న ధ్యాస – భరోసా పెంపు పై లేకపాయే. 10 తగ్గిస్తే పగబట్టి 10 కి 10 కలిపి మరి పెంచుతాం అనబట్టే. నాడు అడ్డగోలు ఆరోపణలు.. నేడు అడ్డగోలు ధరల పెంపు. పెంచుకో – దంచుకో – పంచుకో..నేడు మద్యం ధరల పెంపు రేపు రేపు ఏం పెంపో ఏన్నెన్ని పెంపో” అంటూ ట్వీట్ చేశారు కేటీఆర్.

Read more RELATED
Recommended to you

Latest news