ఉస్మానియా పై గవర్నర్ తమిళిసై వ్యాఖ్యలు దురదృష్టకరమని అన్నారు మంత్రి హరీష్ రావు. నేడు సరోజినీ ఆసుపత్రిలో పోకో మిషన్లు ప్రారంభించిన అనంతరం మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ.. 2015 జూలైలో సీఎం కేసీఆర్ ఉస్మానియాను సందర్శించారని.. అప్పట్లో 200 కోట్లు ఖర్చు చేసి నూతన బిల్డింగ్ కట్టాలని నిర్ణయించారని తెలిపారు. కానీ కొంతమంది కోర్టుకు వెళ్లి స్టే తీసుకువచ్చారని అన్నారు. నిపుణుల కమిటీ ఒక నివేదిక కోర్టుకు నివేదించామని.. కోర్టు ఐఐటి హైదరాబాద్, డైరెక్టర్ ఆర్కియాలజీ మెంబర్లు కమిటీ వేశారని తెలిపారు.
కోడిగుడ్డు మీద ఈకలు పీకే విధంగా.. బురదజల్లే ప్రయత్నం గవర్నర్ చేస్తున్నారని మండిపడ్డారు. ప్రభుత్వానికి సలహాలు ఇవ్వచ్చు కానీ.. బురదజల్లే ప్రయత్నం చేయొద్దని అన్నారు. వైద్య సిబ్బంది చాలా కష్టపడుతున్నారని.. కంటి వెలుగు మీద ఒక్కసారి కూడా మెచ్చుకోలేదని అన్నారు. వైద్య సిబ్బందిని మెచ్చుకోవడానికి గవర్నర్ కి మనసు రాలేదా..? అని ప్రశ్నించారు. చెడు చూస్తాం, చెడు చేస్తాం, చెడు వింటాం అని గవర్నర్ అంటే ఎలా..? అని నిలదీశారు.