బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఫోన్ తిరిగి ఇచ్చేయాలని పోలీసులకు తెలంగాణ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. నిబంధనల ప్రకారం.. నోటీసులు ఇవ్వకుండా ఫోన్ ను స్వాధీనం చేసుకోవడానికి వీలు లేదని హైకోర్టు పేర్కొంది. దీనికి ప్రభుత్వ తరపు న్యాయవాది స్పందిస్తూ.. బంజారాహిల్స్ సీఐ విధులకు ఆటంకం కలిగించారంటూ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి పై నమోదైన కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది.
దర్యాప్తులో భాగంగా కౌశిక్ రెడ్డి ఫోన్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కనీసం నోటీసులు ఇవ్వకుండా మొబైల్ ను లాక్కున్నారంటూ కౌశిక్ రెడ్డి పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై ఇవాళ హై కోర్టు విచారణ చేపట్టింది. మొబైల్ ను FSL కి పంపాల్సి ఉంటుందని ప్రభుత్వ న్యాయవాది కోర్టుకు తెలిపారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆయన కుట్రలు పన్నుతున్నారని వాదించారు. ఫోన్ సీజ్ చేయాల్సి వస్తే.. నిబంధనల ప్రకారం నోటీసులు ఇచ్చి తీసుకోవాలని హైకోర్టు స్పష్టం చేసింది.