తెలంగాణ నిరుద్యోగులకు శుభవార్త. తెలంగాణ రాష్ట్రంలోని బోధన ఆసుపత్రుల పరిధిలో 1,442 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీ ప్రక్రియను ఈ నెలాఖరులోగా పూర్తి చేయాలని మంత్రి హరీష్ రావు ఆదేశించారు.
ఇప్పటికే సర్టిఫికెట్ వెరిఫికేషన్, ఇతర ప్రక్రియలు పూర్తయిన తరుణంలో ఫలితాలను ఈ నెలాఖరులోగా వెల్లడించేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. తోలుత 1,147 పోస్టులకు నోటిఫికేషన్ రాగా, మరో 295 పోస్టులను చేర్చారు. మొత్తం 34 విభాగాల్లో వీరిని నియమిస్తారు.