కంచర గాడిదను ఇంటికి పంపించి.. రేసు గుర్రాన్ని తీసుకొచ్చారు తెలంగాణ ప్రజలు : సీఎం రేవంత్ రెడ్డి

-

తెలంగాణ సీఎంగా మరో పదేళ్లు ఉంటానంటూ పేర్కొన్నారు. కేసీఆర్ మళ్లీ అధికారంలోకి వస్తామంటున్నారని.. అసెంబ్లీకి రాని వారికి అధికారం ఎందుకంటూ వ్యాఖ్యానించారు. అసెంబ్లీకి రావడానికి కేసీఆర్ కి ధైర్యం లేదని.. కానీ నల్గొండ పోయి మాట్లాడుతున్నారంటూ కౌంటర్ ఇచ్చారు.. పాలిచ్చే బర్రెని కాదని దున్నపోతును తెచ్చుకున్నారని కేసిఆర్ అంటున్నారు.. నిన్న అసెంబ్లీలో అటెండర్ కంచర గాడిదను ఇంటికి పంపించి.. రేసు గుర్రాన్ని తీసుకొచ్చారు  అని చెప్పారు.

ఇప్పుడు రేసు గుర్రం వచ్చిందని చెప్పాడంటూ కౌంటర్ ఇచ్చారు.  ఈ రేస్ లో నైనా ఈ గుర్రం గెలుస్తుందని తెలిపారు.  చచ్చిన పామును చంపే అలవాటు తమకు లేదన్నారు. 10 ఏళ్ల క్రిందట కేసిఆర్ పెట్టిన సంతకాలు ఇప్పుడు గుదిబండగా మారాయని.. అడ్డా మీద కొట్లడటం కాదు చట్ట సభలోకి రావాలంటూ రేవంత్ రెడ్డి సవాల్ చేశారు. నూతనంగా ఎంపికైన కానిస్టేబుల్స్ కు రేవంత్ రెడ్డి కీలక సూచనలు చేశారు. రాష్ట్రంలో గంజాయిని మాట వినిపించకుడదని.. గంజాయిపై ఉక్కుపాదం మోపాలంటూ పిలుపునిచ్చారు.

 

Read more RELATED
Recommended to you

Latest news