భారీగా తగ్గనున్న పెట్రోల్, డీజిల్ ధరలు..లీటర్ కు రూ.5 తగ్గింపు !

మన దేశంలో పెట్రోల్‌ మరియు డీజిల్‌ ధరలు ఆకాశన్నంటిన విషయం తెలిసిందే. పెరుగుతున్న పెట్రోల్‌ ధరలు సామాన్యులకు చుక్కలు చూపిస్తున్నాయి. ఇక ఇప్పటికే చాలా రాష్ట్రాల్లో పెట్రోల్‌ ధరలు సెంచరీ దాటి 150 వైపు వెళుతోంది. అటు డీజిల్‌ కూడా పెట్రోల్‌ తో పోటీ పడుతోంది.

అయితే, పెట్రోల్ ధరలు తగ్గనున్నాయని ప్రచారం జోరుగా సాగుతోంది. ఈ నెల 7 నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో పెట్రోల్ ధరలు తగ్గించబోతున్నట్లు కేంద్ర ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. విపక్షాల విమర్శలకు చెక్ పెట్టేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. అంతర్జాతీయంగా క్రూడ్ ఆయిల్ ధరలు భారీగా పతనమయ్యాయి. బ్యారెల్ ముడిచమురు ధర ఏకంగా 90 డాలర్ల దిగువకు పడిపోయింది. 2022 మార్చి తో పోలిస్తే 27% వరకు క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గాయి. ఈ నేపథ్యంలోనే మార్కెట్ వర్గాల అంచనా ప్రకారం లీటర్ కు ఐదు రూపాయలు చొప్పున తగ్గించే అవకాశం కనిపిస్తోంది. పెట్రోల్ ధరలు తగ్గింపు పై ఇవాలే ప్రకటన చేయనున్నట్లు తెలుస్తోంది.