కుండపోత వర్షాలతో తెలంగాణ వణుకుతోంది. అత్యధికంగా ములుగు జిల్లా వెంకటాపూర్ ప్రాంతాల్లో ప్రాంతంలో 24 గంటల్లో 649.8 మిల్లీమీటర్ల రికార్డు స్థాయి వర్షాపాతం నమోదయింది. భూపాలపల్లి, కరీంనగర్, హనుమకొండలోను భారీ వర్షాలు పడ్డాయి. కొన్ని జిల్లాల్లో సంవత్సరం మొత్తం పడాల్సిన వర్షం ఒక్కరోజులోనే నమోదైనట్లు వాతావరణ విశ్లేషకులు చెబుతున్నారు.
ఇక అటు భూపాలపల్లి జిల్లాలో వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. దీంతో భూపాలపల్లి జిల్లా జాతీయ రహదారి 353 పై మోరంచవాగు ఉప్పొంగడంతో మోరంచపల్లి గ్రామం జలదిగ్బంధంలో చిక్కుకుంది. ఈ కారణంగా భూపాలపల్లి పరకాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. వరంగల్ నుండి ములుగు వెళ్లే జాతీయ రహదారి కటాక్షాపూర్ వద్ద చెరువు పూర్తిగా నిండి మత్తడిపడుతుండంతో ఈరోజు వరద ప్రవాహం పెరిగి రాకపోకలు నిలిచిపోయే అవకాశం ఉంది.