హైదరాబాద్ లో ఉన్న ప్రజలకు బిగ్ అలర్ట్. హైదరాబాద్ లో సామాన్యులకు ఇంటి అద్దెలు భారంగా మారుతున్నాయి. రోజురోజుకు రెంట్లు ఇష్టానుసారం పెంచేస్తుండటంతో అద్దె కట్టే వారికి ఆర్థిక భారం పెరుగుతుంది.
కోవిడ్ కు పూర్వం అద్దెలకు ప్రస్తుతం ఉన్న అద్దెలకు చాలా వ్యత్యాసం ఉంది. 2019తో పోలిస్తే ఇప్పుడు హైదరాబాద్ లో 25 నుంచి 30 శాతం పెరిగాయి. దేశవ్యాప్తంగా కూడా ఇదే పరిస్థితి నెలకొంది. దేశంలోని మిగతా నగరాల్లో 15 నుంచి 20 శాతం రెంట్లు పెరిగాయి.
కాగా, వచ్చే నెల రెండోవారం నాటికి ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం డైరెక్టర్ నాగరత్న ఒక ప్రకటనలో తెలిపారు. శీతాకాలం ముగింపు దశకు రావడంతో చలి తీవ్రత క్రమంగా తగ్గుతుందని పేర్కొన్నారు. ఫిబ్రవరి మొదటివారం వరకు చలిగాలులు వీస్తాయని, రెండోవారంలో ఉదయం వేడిగాలులు, సాయంత్రం చలిగాలులు వీస్తాయని తెలిపారు. అదే నెల మూడో వారంలో మళ్లీ చలి పెరుగుతుందని, నాలుగో వారంలో ఎండల తీవ్రత మొదలవుతుందని తెలిపారు.