సింగరేణి సంస్థకు చెందిన ఒడిశా రాష్ట్రంలోని నైనీ బ్లాక్ బొగ్గు గనులను ఓ ప్రయివేటు సంస్థకు కేటాయింపు వెనుక రాఫెల్ కంటే పెద్ద కుంభకోణం జరిగిందని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఆరోపించారు. ప్రధాని మోడీ, తెలంగాణ సీఎం కేసీఆర్ కలిసి రూ.50వేల కోట్లకు పైగా దోచుకుంటున్నారు అని సంచలన వ్యాఖ్యలు చేశారు. గాంధీ భవన్‌లో రేవంత్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు.
నైనీ బ్లాకు బొగ్గు గనులను 25 ఏళ్లకు ఓ ప్రైవేలటు సంస్థకు లీజుఉ ఇచ్చారని, ఈ కేటాయింపు కోల్ ఇండియా నిబంధనలను కాలరాసి ఒకరిద్దరూ వ్యక్తులకు లబ్ది చేకూరే విధంగా వ్యవహరించారని ఆరోపించారు. రాఫెల్ కుంభకోణం రూ.35వేల కోట్లు అయితే ఈ కుంభకోణం విలువ రూ.50 వేల కోట్లు ఉంటుందని చెప్పారు. దీనిపై తాము కేంద్ర గనుల శాఖ మంత్రి ప్రహ్లద్ జోషికి ఫిర్యాదు చేస్తే.. కేసీఆర్ విషయంలో తామేమి చేయలేము అని అంతా ప్రధాని కార్యాలయం చూసుకుంటుందని చెప్పారని పేర్కొన్నారు. కేంద్ర విజిలెన్స్ కమిషన్‌కు తమ ఫిర్యాదు పంపాలని అడిగినా ప్రహ్లద్ జోషి చేతులెత్తేశారని విమర్శించారు.