సీఎం ఎంపికలో ఎలాంటి తాత్సారం జరుగలేదు : ఉత్తమ్ కుమార్ రెడ్డి

-

నల్లగొండ ఎంపీ, హుజూర్ నగర్ ఎమ్మెల్యే, మాజీ పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇవాళ ఢిల్లీకి వెళ్లిన విషయం తెలిసిందే. ఢిల్లీలో డీ.కే.శివకుమార్ తో భేటీ అయ్యారు. పలు అంశాల గురించి చర్చించారు. అనంతరం ఓ ఇంటర్వ్యూలో పాల్గొని పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు ఉత్తమ్. తాను మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉన్నాను. నేను పీసీసీ ఛీప్ గా ఉన్నప్పుడు బీఆర్ఎస్ పై ఇంత వ్యతిరేకత లేదు. 70 స్థానాలకు పైగా గెలుస్తామనుకున్నాం. 64 వద్దనే ఆగిపోవడం కాస్త బాధ కలిగించిందనే చెప్పాను. తెలంగాణ ప్రజల గుండెల్లో గాంధీ కుటుంబం వ్యక్తులున్నారు.

పార్లమెంట్ సమావేశాలకు నేను ఢిల్లీకి వచ్చాను. పార్టీనీ ఎప్పుడూ వీడలేదు.. బయటి నుంచి రాలేదు. పార్టీ పెద్దలను కలిసి చెప్పాల్సింది చెప్పాను. అందరి అభిప్రాయం మేరకు ఏఐసీసీ నిర్ణయం తీసుకుందని చెప్పారు ఉత్తమ్ కుమార్ రెడ్డి. నేను, నా భార్య ఎప్పుడూ పార్టీ క్షేత్రస్థాయిలో పని చేస్తుంటాం. నాకు ఇచ్చిన పనిని సమర్థవంతంగా పని చేశాను. సీఎం అభ్యర్థిగా అధిష్టానం ఎవ్వరినీ ప్రకటించినా తనకు ఓకే అని చెప్పారు. ప్రతీ ఎన్నికలకు ప్రత్యేక పరిస్థితులుంటాయి. పీసీసీ ప్రెసిడెంట్ కాదు.. కాబట్టి ఆ స్థాయిలో ప్రచారం చేయలేదని ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. సీఎం అభ్యర్థిపై తాత్సారం జరుగలేదు. కేవలం రెండు రోజులు మాత్రమే అయింది. డిసెంబర్ 3న ఫలితాలు.. డిసెంబర్ 04 సీఎల్పీ సమావేశం, డిసెంబర్ 05న ఢిల్లీలో సమావేశం జరిగిందని తెలిపారు ఉత్తమ్.

Read more RELATED
Recommended to you

Latest news