రేవంత్ రెడ్డి మంత్రివర్గంలో మరో ఆరుగురికి అవకాశం ఉంది. ఖాళీగా ఉన్న ఆ స్థానాల కోసం 15 మందికి పైగా సీనియర్లు పోటీ పడుతున్నారు. షబ్బీర్ ఆలీ, ఫిరోజ్ ఖాన్, వివేక్, వినోద్, మల్ రెడ్డి రంగారెడ్డి, అంజన్ కుమార్ యాదవ్, మైనంపల్లి హనుమంతరావు, సుదర్శన్ రెడ్డి, మదన్ మోహన్ రావు, మధుయాష్కి గౌడ్, అద్దంకి దయాకర్, బాలు నాయక్ పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి. సీనియారిటీ కుల సమీకరణాల ప్రకారం పదవులు ఇచ్చే అవకాశం ఉంది.
ఇది ఇలా ఉండగా, సీఎం రేవంత్ రెడ్డి కాన్వాయ్ లోని కార్లకు ఫ్యాన్సీ నంబర్ 0009ను కేటాయించారు. సీఎంగా ప్రమాణ స్వీకారం చేశాక తొలిసారి రేవంత్ కొత్త కాన్వాయ్ ని నిన్న ఉపయోగించారు. ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం సందర్భంగా అందులో అసెంబ్లీకి వెళ్లారు. అయితే అసెంబ్లీకి వెళ్లే మార్గంలో సీఎం కాన్వాయ్ ట్రాఫిక్ లో చిక్కుకుంది. అధికారుల వైఫల్యంతోనే ఇలా జరిగినట్లు గుర్తించిన ఉన్నతాధికారులు, బాధ్యులపై చర్యలకు సిద్ధమైనట్లు తెలుస్తోంది.