తెలంగాణ టీటీడీపిలోకి తీగల కృష్ణారెడ్డి వెళ్లినట్టు తాజాగా ఆయన ప్రకటించారు. ఇవాళ బీఆర్ఎస్ ఎమ్మెల్యే లు మల్లారెడ్డి, మర్రి రాజశేఖర్ రెడ్డిలు ఏపీ సీఎం చంద్రబాబును కలిశారు. వీరు కలిసిన అనంతరం తీగల కృష్ణారెడ్డి మీడియా తో మాట్లాడారు. చంద్రబాబు భేటీ తరువాత తీగల కీలక ప్రకటన చేశారు. తాను టీడీపీలోకి వెళ్తున్నానని మాజీ ఎమ్మెల్యే తీగల కష్ణారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
హైదరాబాద్ అభివృద్ధి చెందింది అంటే తెలుగుదేశం, చంద్రబాబు వల్లనే అని తెలిపారు. తెలంగాణ లో ఇంకా టీడీపీ అభిమానులు చాలా మంది ఉన్నారు. తెలంగాణ లో టీడీపీ కి మళ్లీ పూర్వ వైభవం తీసుకోస్తాం అన్నారు. త్వరలో టీడీపీ లో జాయిన్ అవుతాను అని తెలిపారు. తెలంగాణ వచ్చాక రాష్ట్రం పరిస్థితి ఎలా ఉందో మీరందరూ చూస్తూనే ఉన్నారని పేర్కొన్నారు.