సోషల్ మీడియా ద్వారా తన ఫుడ్ సెంటర్ వైరల్ గా మారడంతో కుమార్ ఆంటీ బిజినెస్ భారీగా పెరిగిపోయింది. ఈ క్రమంలో వేల సంఖ్యల్లో సోషల్ మీడియా ఈ ఆంటీ ఫుడ్ తినాలని బంజారాహిల్స్ వస్తుండడంతో ప్రధాన రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. దీంతో ట్రాఫిక్ అధికారులు అనుమతి లేకుండా నిర్వహిస్తున్న ఫుడ్ స్టాల్ ను తొలగించాలని నిర్ణయించారు. పోలీసులు అక్కడికి చేరుకొని కుమార్ ఆంటీకి తమ పని తాము చూసుకుంటామని ట్రాఫిక్ ఇబ్బందుల వల్ల ఫుడ్ సెంటర్ నిలిపివేస్తున్నామని ఆమెకు తెలిపారు.
మంగళవారం మొత్తం కుమారీ ఆంటీకి అధికారులు అన్యాయం చేస్తున్నారని నెటిజన్లు చర్చకు దారి తీశారు. దీనిపై స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి ట్రాఫిక్ అధికారులకు సాయికుమార్ ఫుడ్ సెంటర్ తొలగించవద్దని యధావిధిగా ఆమె ఫుడ్ సెంటర్ కొనసాగించాలని ఆదేశాలు జారీ చేశారు. త్వరలోనే తాను సాయికుమార్ ఫుడ్ సెంటర్ విజిట్ చేస్తానని చెప్పారు. సీఎం ఆదేశాలతో కుమారి ఆంటీ ఫుడ్ స్టాల్ కి పర్మిషన్ ఇచ్చారు. దీనిపై కుమార్ ఆంటీ స్పందించారు. స్వయానా సీఎం స్పందించి.. తనను ఆదుకోవడం.. తానే వచ్చి భోజనం చేస్తాను అని చెప్పడం చాలా సంతోషంగా ఉందన్నారు. సీఎం రేవంత్ రెడ్డి రాకకు తాను ఎన్ని జన్మల పుణ్యమో అని.. తన కష్టాలు సీఎం గుర్తించడం చాలా సంతోషంగా ఉండాలని చెబుతూ భావోద్వేగానికి లోనయ్యారు.