తెలంగాణలో ముగ్గురు శాసనసభ్యులు తనతో టచ్ లో తెలిపారు ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్. తన పార్టీలో ఎవరైనా చేరే అవకాశం ఉందని అన్నారు. కెసిఆర్ ఫోన్ టాపింగ్ ద్వారా ఆ ముగ్గురు ఎమ్మెల్యేలు ఎవరు అనేది తెలుసుకోవచ్చు అని అన్నారు. అంతేకాదు తను ఎవరితో ఫోన్ మాట్లాడుతున్నాను అనేది కూడా తెలుసుకోవచ్చు అన్నారు. బిఆర్ఎస్ పార్టీ బిజెపికి బీ టీం అని ఆరోపించారు.
సీఎం కేసీఆర్ పుట్టినరోజున సచివాలయ ప్రారంభోత్సవం విషయంలో వెనక్కి తగ్గారని, అంటే ముఖ్యమంత్రి ఓడిపోయారని.. అంబేద్కర్ గెలిచారని, బడుగు బలహీన వర్గాలు గెలిచాయన్నారు. అంబేద్కర్ జయంతి ఏప్రిల్ 14న సచివాలయం ప్రారంభించాలని డిమాండ్ చేశారు. కెసిఆర్ పై పోరాటంలో తాను వెనక్కి తగ్గబోనని స్పష్టం చేశారు కేఏ పాల్. అంతేకాదు సీఎం కేసీఆర్ కి ముందస్తు జన్మదిన శుభాకాంక్షలు కూడా తెలియజేశారు.