హనుమాన్‌ ఫలం గురించి విన్నారా..?12 రకాల క్యాన్సర్లను తరిమి కొట్టే దివ్యఔషధం..!!

-

సీతాఫలం పండ్ల గురించి చాలామందికి తెలిసి ఉంటుంది. అందరూ వాటిని ఇష్టంగా తింటారు. వాటితోపాటు రామాఫలం కూడా ఉంటుందని..కొంతమందికే తెలుసు.. రామాఫలం కూడా మంచి ఆరోగ్యవంతమైన పండు.. కానీ మీకు లక్ష్మణ ఫలం గురించి తెలుసా..? దీన్నే కొంతమంది హనుమాన్‌ ఫలం అని కూడా అంటారు. సోర్సూప్ లేదా గ్రావియోల అంటారు. ఉష్ణ మండల ప్రాంతంలోనే ఈ చెట్లు పెరుగుతాయి. మెక్సికో, దక్షిణ అమెరికాలో అధికంగా ఈ చెట్లు కనిపిస్తాయి. ఈ పండు వల్ల ఎలాంటి ఉపయోగాలు ఉన్నాయో చూద్దామా..!
రామాఫలం, సీతాఫలం జాతికి చెందినవే ఇవి కూడా…ఈ పండు తింటుంటే స్ట్రాబెర్రీ, పైనాపిల్ పండ్లను కలిపి తింటున్నట్టు అనిపిస్తుంది.అలా అని రుచి వెరైటీగా ఉంటుందని కాదు, రుచి బాగుంటుంది. శరీరానికి కూడా ఈ పండులోని పోషకాలు ఎంతో మేలు చేస్తాయి. కేవలం పండే కాదు ఈ చెట్టు ఆకులు, బెరడు, వేర్లు, కాయలు, విత్తనాలు కూడా వ్యాధుల చికిత్సలో సంప్రదాయ కషాయాలు తయారు చేయడానికి వినియోగిస్తారు.
ఈ పండు బ్రెజిల్‌కి చెందినదిగా చెబుతారు. అక్కడే మొదటగా ఈ చెట్టును కనిపెట్టారట.. అయితే దక్షిణ భారతదేశంలో కొన్నిచోట్ల ఈ రామాఫలం చెట్లు కనిపిస్తున్నాయి. ఈ పండు తొక్కపై ముళ్ళు ఉంటాయి.

పోషకాలు..

అధ్యయనాల ప్రకారం హనుమాన్ పండ్లలో ఆల్కలాయిడ్స్, ఫ్లేవనాల్, ట్రై గ్లిజరైడ్స్, ఫినోలెక్స్, సైక్లోపెటైట్స్ వంటి ముఖ్యమైన ఫైటో కెమికల్స్ 212 దాకా ఉంటాయి.
100 గ్రాముల పండును తింటే అందులో 81 గ్రాములు నీరే ఉంటుంది.
ప్రోటీన్, డైటరీ ఫైబర్, క్యాల్షియం, ఐరన్, మెగ్నీషియం, పొటాషియం, ఫాస్పరస్, ఫొలేట్ వంటి ఎన్నో పోషకాలు ఈ పండులో నిండి ఉన్నాయి.
ఈ పండును యాంటీ క్యాన్సర్, యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ ఆక్సిడెంట్, యాంటీ ఆర్థరైటిస్, యాంటీ మైక్రోబయల్, యాంటీ డయాబెటిక్ లక్షణాలను కలిగి ఉంటుంది.

కీమోథెరపీ పండు..

ఈ పండును సహజసిద్ధంగా ప్రకృతి ప్రసాదించిన కీమోథెరపీ అని కూడా చాలా చోట్ల పిలుస్తారు. ఈ పండును, ఈ చెట్టు ఆకులను తీసుకోవడం వల్ల 12 రకాల క్యాన్సర్లను తరిమి కొట్టవచ్చట.. ఇందులో ఉండే ఎసిటోజెనిన్స్, క్వినోలోన్స్, ఆల్కలాయిడ్స్ వంటి యాంటీ ఆక్సిడెంట్లు నేరుగా క్యాన్సర్ కణాలపై దాడి చేస్తాయట. రొమ్ము క్యాన్సర్, ఊపిరితిత్తుల క్యాన్సర్, ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ వంటి రోగాల నుంచి ఈ పండు రక్షిస్తుంది.
యుటీఐ లేదా యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ ఎక్కువమంది మహిళలు ఎదుర్కొంటున్న ఆదారణ ఆరోగ్య సమస్యలలో ఇది ఒకటి. ఈ సమస్యతో బాధపడుతున్న వారు హనుమాన్ ఫలం తినడం వల్ల ఉపయోగం ఉంటుంది. ఇందులో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది కాబట్టి మూత్రంలో ఆమ్లస్థాయిని ఆరోగ్యకరంగా నిర్వహిస్తుంది.
విటమిన్ సి పుష్కలంగా ఉండే ఈ పండు జీర్ణవ్యవస్థకు చాలా మేలు చేస్తుంది. దీన్ని తరచూ తీసుకోవడం వల్ల జీర్ణ రుగ్మతలు తొలిగిపోతాయి. జీర్ణ సంబంధ సమస్యలకు ఇది చెక్ పెడుతుంది. జీర్ణ సమస్యలతో బాధపడుతున్నట్లయితే ఈ పండును తరచూ తినడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. ఈ పండు తినడం వల్ల కడుపు ఉబ్బరం కూడా తగ్గుతుంది..
చాలామంది స్త్రీలకు పీరియడ్స్ సమయంలో శరీరంలో నీరు నిలిచిపోయి ఉబ్బినట్లు కనిపిస్తారు. హనుమాన్ ఫలం తినడం వల్ల ఆ సమస్య తగ్గుముఖం పడుతుంది. ఇందులో ఉండే పొటాషియం శరీరంలో నీరు నిలుపుదలను నివారిస్తుంది.

Read more RELATED
Recommended to you

Latest news