ఇవాళ మహారాష్ట్రలో సీఎం కేసీఆర్ బహిరంగ సభ

-

ఇవాళ మహారాష్ట్రలో తెలంగాణ సిఎం కెసిఆర్ పర్యటించనున్నారు. మహారాష్ట్ర నాందేడ్ జిల్లాలోని లోహాలో బీఆర్ఎస్‌ బహిరంగ సభ నిర్వహించనుంది. లోహాలో బీఆర్ఎస్‌ నిర్వహించే.. బహిరంగ సభకు ముఖ్య అతిథిగా బీఆర్ఎస్‌ అధ్యక్షుడు కేసీఆర్‌..హాజరుకానున్నారు.

మహారాష్ట్రలో ఇది బీఆర్ఎస్‌ రెండో బహిరంగ సభ. ఈ తరుణంలోనే బీఆర్ఎస్‌ పార్టీ నాయకులు అన్నీ ఏర్పాట్లు చేశారు. ఇక అటు ఏప్రిల్ 8 న తెలంగాణ రాష్ట్రానికి ప్రధాని నరేంద్ర మోడీ వచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం అందుతోంది. దీనిపై ప్రధాని కార్యాలయం ఆరా తీసింది. సికింద్రబాద్ రైల్వే స్టేషన్ పునరుద్దరణ పనులకి శంఖుస్థాపన, వందే భారత్ ట్రైన్ ప్రారంభోత్సవంతో పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభం, శంకుస్థాపన చేయనున్నారు మోడీ. అలాగే బహిరంగ సభ ఉండే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలోనే ఏప్రిల్ 8 న తెలంగాణ రాష్ట్రానికి ప్రధాని నరేంద్ర మోడీ వచ్చే అవకాశం ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news